కాంగ్రెస్ పార్టీ తెలివితేటలు చూస్తే.. చార్లీచాప్లిన్ గుర్తుకు వస్తాడు!!

కాంగ్రెస్ పార్టీ తెలివితేటలు చేస్తూ కచ్చితంగా చార్లీచాప్లిన్ గుర్తుకురాక మానడు. ఎందుకంటే తాను ఏమీ మాట్లాడకుండాన కేవలం తన చేష్టలద్వారా అందరినీ నవ్విస్తాడు. అయితే ఇక్కడ కొంచెం తేడా ఉంది. నవ్వించడం కాకుండా కాంగ్రెస్ పార్టీ నవ్వులపాలవుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కచ్చితంగా ఏ పార్టీ అయినా మైనార్టీలకు మంత్రి పదవిని కేటాయిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మైనార్టీలకు ఇంతవరకు మంత్రి పదవిని ఇవ్వలేదు. ఆ పార్టీ తరఫున షబ్బీర్ అలీ లాంటి సీనియర్ నేత నుంచి పాతబస్తీలో మజ్లిస్ కు వణుకు పుట్టిస్తున్న నాంపల్లి ఫిరోజ్ ఖాన్ లాంటి యువనేతలు ఎందరో ఉన్నారు.

మణికట్టు మాయాజాలం పనిచేయదు
వీరందరినీ కాదని అజహరుద్దీన్ కు ఎందుకు మంత్రి పదవి ఇస్తున్నారంటే కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయాడు. తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇతనిపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. క్రికెట్ ఆడేటప్పుడు తన మణికట్టు మాయాజాలంతో మంచి బ్యాటింగ్ చేసేవాడు. కానీ నిజ జీవితంలో, అందులోను రాజకీయాల్లో మణికట్టు మాయాజాలం చేయాలంటే కుదరదు. నిజాయితీగా ఉండాలి. ప్రజలకు స్వచ్ఛంగా సేవలందించాలి. కానీ ఇవి అజహరుద్దీన్ దగ్గర లోపించాయి. అయినా మంత్రి పదవి మాత్రం వరిస్తోంది.

When you look at the intelligence of the Congress party you ll be reminded of Charlie Chaplin

హాస్యాస్పదమైన రాజకీయం
మొదటి నుంచి మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకుండా, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి 80వేల ఓటుబ్యాంకు ఉందని, వారిని ఆకట్టుకోవడం కోసం మంత్రి పదవినిస్తే వారు అర్థం చేసుకోలేనంత అమాయకులా? కాదుకదా. మరి ఎందుకు ఇటువంటి సమయంలో ఇలాంటి హాస్యాస్పదమైన రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుందో ఆ పార్టీలోని నేతలకే తెలియదు. రాష్ట్రాల్లో పరిస్థితులను అంచనా వేయకుండా కేవలం ఢిల్లీలో కూర్చొని నిర్ణయిస్తే ఇలాగే ఉంటుంది. రేపు ఒకవేళ ఫలితం వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారు? అంటే దానికి సమాధానం మాత్రం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్ద ఉండదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+