మిస్ వరల్డ్ పేరుతో సీఎం రేవంత్ చేసిందిదే!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. అరకొరగా వస్తున్న యూరియాను దక్కించుకోవాలని రైతులు ఉదయం నుంచి సహకార సంఘాల ఎదుట బారులు తీరుతున్నారు. అధికారులు టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేస్తున్నారు. చాలామంది రైతులు యూరియా దొరకక తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ పరిస్థితి పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
కాంగ్రెస్ ఎంపీలు తీసుకురాలేరు, బీజేపీ ఎంపీలు అడగలేరు: కేటీఆర్
రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి అవసరమైన యూరియాను కాంగ్రెస్ ఎంపీలు తీసుకురాలేరని, బీజేపీ ఎంపీలు అడగలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. యూరియా కోసం రైతులు ధర్నా చేస్తున్న పట్టింపు లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

సీఎం, మంత్రులు ఎక్కడున్నారు?
సీఎం, మంత్రులు ఎక్కడున్నారు? సమస్యలు ఇక్కడుంటే సీఎం, మంత్రులు ఉండేది ఢిల్లీ, బీహార్ లోనా అంటూ ఆయన ప్రశ్నించారు. జాతీయ పార్టీలకు ఓట్లు , రాష్ట్ర ప్రజలకు పాట్లు అంటూ సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాల పైన ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు సైతం సీఎం రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేశారు.
సీఎంకు ముందుచూపు లేకపోవడం వల్లే రైతులకీ కష్టాలు
రైతులకు యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని హరీష్ రావు విమర్శించారు. రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్షాల దుష్ప్రచారం అని అధికారపక్షం ప్రచారం చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. సీఎంకు ముందుచూపు లేకపోవడం వల్లే రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఈ బాధ
నాటి రోజులు తెస్తామని పదే పదే చెప్పిన రేవంత్ రెడ్డి అన్నమాట నిలుపుకుని మళ్లీ రైతులకు నాడు కష్టాలు పడిన కాంగ్రెస్ దుర్మార్గపు పాలన నాటి రోజులను తీసుకొచ్చాడు అన్నారు. మిస్ వరల్డ్ పేరుతో రెండు నెలలు పాలనను గాలికి వదిలేసి, రైతుల గురించి ఆలోచించకుండా వ్యవహరించిన ఫలితమే ఇప్పుడు రైతులకు యూరియా కష్టాలు అన్నారు. ఎరువులు, విత్తనాల గురించి సీఎం సమీక్ష చేయలేదని, ఒక బాధ్యత, ప్రణాళిక, కార్యాచరణ ఏది లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఈరోజు ఎరువుల కష్టాలు వచ్చాయని హరీష్ రావు టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications