రేవంత్‌ దెబ్బ: ఆ లేఖ ఎక్కడుంది, చంద్రులకు చుక్కలేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టిడిపికి రాజీనామా చేసే సమయంలో రేవంత్‌రెడ్డి వ్యూహత్మకంగా అడుగులు వేశారు. రేవంత్‌రెడ్డి రాజీనామాపై ఇంకా సస్పెన్ష్ కొనసాగుతోంది. రేవంత్ రాజీనామా రెండు రాష్ట్రాల సీఎంలకు రాజకీయంగా ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.రాజీనామా లేఖను రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కార్యాలయంలో అందజేసి టిడిపిని ఆత్మరక్షణలో పడేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  Revanth Reddy resignation High drama : "రాజీనామా" చెయ్యలేదంటగా ? | Oneindia Telugu

  రేవంత్ ఎఫెక్ట్: కోమటిరెడ్డిపై ప్రభావం, మూడో కూటమితో ఎవరికి నష్టం?

  టిడిపి తెలంగాణ రాష్ట్రశాఖకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి గత నెల 31వ, తేదిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తెలంగాణలో టిడిపికి చెందిన కొందరు కీలకనేతలు కూడ రేవంత్‌రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీలో చేరారు.

  రేవంత్‌కు షాక్: 'టిడిఎల్పీ, పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని ఆదేశం'

  వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొంటామనే ప్రచారం నేపథ్యంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే రేవంత్ లక్ష్యం వేరే ఉన్నందున ఆయన టిడిపిని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

  రేవంత్‌ దెబ్బ: 'శత్రువులెవరో, మిత్రులెవరో చెప్పలేం, స్వంత పనంటూ ఢిల్లీకి'

  బాబుకు షాక్: 40 సీట్లకు పట్టు, 25 సీట్లకు ఓకే: రేవంత్ వ్యూహమిదే!

  రేవంత్ వ్యూహత్మకంగా అడుగులు

  రేవంత్ వ్యూహత్మకంగా అడుగులు

  టిడిపికి రాజీనామా చేసే సమయంలో రేవంత్‌రెడ్డి వ్యూహత్మకంగా అడుగులు వేశారు. ఎమ్మెల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కార్యాలయంలో ఇచ్చారు. అదే సమయంలో పార్టీకి కూడ రాజీనామా చేస్తున్నట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కానీ, రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ ఇంతవరకు తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి చేరలేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం సమకూర్చిన గన్‌మెన్లు, పిఎను కూడ తిప్పిపంపారు.అయితే పార్టీ భి.ఫాం ఇచ్చిన చంద్రబాబునాయుడుకే తన రాజీనామా లేఖను ఇచ్చినట్టు రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. కానీ, రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖను చంద్రబాబునాయుడుకు అందజేసి రాజకీయంగా టిడిపిని ఇరుకునపడేలా రేవంత్‌రెడ్డి చేశారు.

  రేవంత్ రాజీనామా లేఖ ఎక్కడుంది

  రేవంత్ రాజీనామా లేఖ ఎక్కడుంది

  రేవంత్‌రెడ్డి తన రాజీనామా లేఖను చంద్రబాబునాయుడు కార్యాలయంలో అందించారని అంటున్నారు. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 13 రోజులైనా కానీ ఇంతవరకు కూడ రాజీనామా లేఖ తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి చేరుకోలేదు. అయితే ఈ లేఖ ఎక్కడుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబునాయుడు కార్యాలయంలోనే ఈ లేఖ ఉందా.. లేక ఆ లేఖను తెలంగాణ టిడిపి నేతలకు బాబు అందించారా... అసలు ఆ లేఖ ఎవరి వద్ద ఉందనే చర్చ సాగుతోంది. ఆ లేఖను అమరావతి నుండి రిజిష్టర్ పోస్టులో పంపినా ఇప్పటికే తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి చేరుకొనే అవకాశం ఉంటుందని టిఆర్ఎస్ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రాజీనామా లేఖ ఎక్కడుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

  బాబుకు ఇబ్బందులేనా

  బాబుకు ఇబ్బందులేనా

  రేవంత్‌రెడ్డి రాజీనామా ఆమోదం పొందితే ఏపీలో టిడిపికి రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. ఇందులో నలుగురిని మంత్రివర్గంలోకి కూడ చంద్రబాబునాయుడు తీసుకొన్నారు. ఈ తరుణంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ శాసనసభపక్షం స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఈ తరుణంలో రేవంత్‌రెడ్డి రాజీనామా ఆమోదం పొందితే రాజకీయంగా ఏపీలో టిడిపికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

  కెసిఆర్‌ వ్యూహమిదే

  కెసిఆర్‌ వ్యూహమిదే

  తెలంాణలో కూడ ఇదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. 12 మంది టిడిపి ఎమ్మెల్యేలు టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు. అయితే టిడిపి శాసనసభపక్షాన్ని టిఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు ఆనాడు టిడిపి శాసనసభపక్ష నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. అయితే ఎర్రబెల్లిని తొలగించి రేవంత్‌రెడ్డిని టిడిపి శాసనసజభపక్ష నేతగా ఎన్నుకొన్నట్టుగా చంద్రబాబునాయుడు తెలంగాణ స్పీకర్‌కు లేఖ పంపారు.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డిలు కోర్టులో కేసులు దాఖలు చేశారు. అయితే వీరిద్దరూ ప్రస్తుతం పార్టీలు మారారు. కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై కూడ చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ కూడ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ తరుణంలో రేవంత్‌రెడ్డి రాజీనామాను ఆమోదిస్తే ఇతర పార్టీల నుండి టిఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశం లేకపోలేదు. అయితే ఈ పరిణామాలపై వేచిచూసే ధోరణిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలు అవలంభిస్తున్నాయా అనే అనుమానాలు కూడ లేకపోలేదు.అయితే సుప్రీంకోర్టు తీర్పు కూడ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యైలపై చర్యలు తీసుకొనే విషయంలో నిర్ణయాల జాప్యానికి కారణంగా కన్పిస్తోందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

  కొడంగల్ ఉపఎన్నిక కోసమిలా

  కొడంగల్ ఉపఎన్నిక కోసమిలా

  కొడంగల్ ఉప ఎన్నిక కోసం టిఆర్ఎస్ నాయకత్వం అన్ని రకాల శక్తియుక్తులను వినియోగించుకొనే ప్రయత్నాలను ప్రారంభించింది. రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ అందితే స్పీకర్ దానిపై నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకొంటారని టిఆరఎస్ నేతలు పైకి చెబుతున్నారు. కానీ, ఈ రాజీనామా లేఖ ఎప్పుడు స్పీకర్ కార్యాలయానికి చేరుతోందా అని టిఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారు. ఒక వేళ ఉపఎన్నికలు రాకపోయినా..2019 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డిని ఓడించేందుకు ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  High drama is continuing as Revanth Reddy's resignation letter is yet to reach Telangana Assembly Speaker till Thursday.where is Revanth reddy resignation letter? now hot topic.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి