చైతూను ముద్దు పెట్టుకోవాలంటే మొదటి భార్య అడ్డు : విడాకుల వెనుక అసలు కారణాలు : సమంత వ్యాఖ్యలతో..!!
టాలీవుడ్ గ్లామరస్ పెయిర్ సమంత - నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇప్పుడు సినీ ఇండస్డ్రీలోనే కాదు..అభిమానుల్లో..సామాన్యుల్లోనూ ఆసక్తి కరంగా మారుతోంది. ఒకరంటే ఒకరు ఇష్టపడి ఏరి కోరి వివాహం చేసుకొని ఇప్పుడు విడాకుల వరకు ఎందుకు వెళ్లారనే ఆసక్తి కర చర్చ సాగుతోంది. సమంత పాల్గొనే ఒక షో గురించి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయటంతో అసలు సమస్య మొదలైంది. అటువంటి షో లు వద్దని వారు సూచించినా..సమంత వినిపించుకోలేదని టాక్. దీంతో..నాగ చైతన్య- సమంత మధ్య గ్యాప్ మొదలైంది.

విడాకుల వెనుక అసలు కారణాలు
అది కాస్తా..కాలం గడిచే కొద్దీ ఇప్పుడు విడాకుల వరకు వచ్చిందని చెబుతున్నారు. అయితే, వీరిద్దరూ ఒకరిని ఒకరు అంతగా ఇష్టపడి..ఇప్పుడు విడాకుల వరకు వెళ్లటం వెనుక పలు కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తానికి నాగ చైతన్య తొలి భార్య కారణమనే విషయం తాజాగా వెలుగు లోకి వచ్చింది. నాగ చైతన్యతో గ్యాప్ ప్రారంభం కాగానే సమంత తొలుత తన ఇంటి పేరు అక్కినేని ని సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరు నుంచి తీసేసారు. అప్పుడే ఏదో జరుగుతుందనే చర్చ మొదలైంది. ఆ తరువాత చైతన్య సినిమాలకు గతంలో పూర్తిగా మద్దతు ఇచ్చిన సమంత క్రమేణా దూరం పెట్టింది.

కౌన్సిలింగ్ పూర్తయినా నిర్ణయం మారలేదా
ఇక, ఇద్దరి మధ్య సయోధ్య కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నించినా అది సాధ్య పడలేదని చెబుతున్నారు. దీంతో..ఫ్యామిలీ కౌన్సిలింగ్ మూడు సార్లు ఇచ్చినా వారి నిర్ణయంలో మార్పు రాలేదని సమాచారం. దీంతో..ఇప్పటి వరకు వీరి విడాకుల విషయంలో సాగుతున్న ప్రచారం పైనా వీరిద్దరూ.. అదే విధంగా నాగార్జున ఫ్యామిలీ నుంచి ఎవరూ ఖండించలేదు..అదే సమయంలో నిజమని చెప్పలేదు. కానీ, తాజాగా సమంత తిరుమల లో శ్రీ వారి దర్శనం కోసం వచ్చిన సమయంలో అక్కడి మీడియా ప్రతినిధులు ఇదే విషయం ప్రస్తావించగా..ఇక్కడ అలాంటి విషయాలా అంటూ సీరియస్ అయ్యారు.

నాగ చైతన్య తొలి భార్యతోనే సమస్యా
కానీ, ఇప్పుడు నాగచైతన్య - సమంత మధ్య గ్యాప్ ఎక్కడ మొదలైందంటే తొలి భార్యే కారణమని తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్వయంగా సమంత వెల్లడించిన అంశం ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో..ఇప్పుడు నాగ చైతన్య మొదటి భార్య గురించి తెలుసుకోవటానికి ఇప్పుడు నెటిజెన్లు విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. కొద్ది కాలం క్రితమే సమంత ఈ విషయాన్ని బయట పెట్టారు. గతంలో మంచు లక్ష్మీ చేసిన టాక్ షోలో అతిథిగా హాజరైన సమంతను బెడ్ రూం విషయాల పైన ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. ఆ షోలో బెడ్రూమ్ విషయాలను షేర్ చేసిన సమంతా ఆసక్తి కర విషయాలను వెల్లడించారు.

సమంత ఆ రోజు ఏం చెప్పారు
చైతూను ముద్దు పెట్టుకోవాలంటే మొదటి భార్య అడ్డు వస్తుందని చెప్పుకొచ్చారు. దీంతో..షాక్ అయిన మంచు లక్ష్మీ మొదటి భార్య ఎవరని ప్రశ్నించారు. మొదటి భార్య ఎవరో కాదు.. చైతూ పట్టుకుని పడుకునే పిల్లోనే (తలదిండు) అంటూ సమంత ట్విస్టు ఇఛ్చారు. ఇక, తాజాగా తమ విడాకుల మీద వస్తున్న వార్తల మీద నాగ చైతన్య స్పందించారు. ఇప్పడున్న వార్త మరో నిమిషానికి ఉండదన్న చైతూ. తన తాత కాలంలో నెలకు ఒక మ్యాగజీన్ వచ్చేది.. మళ్లీ వచ్చే నెల వరకు వచ్చే మ్యాగజీన్ వరకు ప్రస్తుతం ఉన్న వార్తనే చర్చించుకునేవారని చెప్పారు.

లవ్ స్టోరీ సక్సెస్ మూడ్ లో నాగ చైతన్య
ఇప్పుడు పరిస్థితి అలా లేదని వ్యాఖ్యానించారు. కానీ, స్పష్టత మాత్రం ఇవ్వలేదు. ఇక, నాగ చైతన్య - సాయి పల్లవి కాంబినేషన్ లో ఈ రోజు విడుదలైన లవ్ ప్టోరీ గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో పాటలు హైలైట్ గా నిలిచాయి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ సైతం నాగ చైతన్య - సాయి పల్లవి కాంబో లో ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. అంచనాలకు తగినట్లుగానే.. పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది లవ్ స్టోరీ మూవీ. దీంతో మూవీ సక్సెస్‌ను మాత్రమే ఎంజాయ్ చేస్తున్న నాగచైతన్య ఇతర అంశాల పైన అంతగా ఫోకస్ పెడుతున్నట్లుగా కనిపించటం లేదు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications