న్యూ ఇయర్ విషెస్ చెప్తే.. ఆ శిక్ష తప్పదు : చిలుకూరు ఆలయ అర్చకుడి హెచ్చరిక

కొత్త సంవత్సరంలో అడుగుపెట్టడానికి మరికొద్ది గంటలే సమయం ఉన్న తరుణంలో.. యూత్ అంతా న్యూ ఇయర్ ఫీవర్‌తో ఊగిపోతోంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాలో,బయట.. న్యూ ఇయర్ విషెస్ చెబుతున్నారు. అయితే న్యూ ఇయర్ విషెస్ చెబితే గుంజీలు తీయిస్తానని హెచ్చరిస్తున్నారు చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర రంగరాజన్.

తెలుగు ప్రజలకు సంబంధించినంత వరకు ఉగాది పర్వదినమే నూతన సంవత్సరం అని,ఆరోజునే న్యూ ఇయర్ విషెస్ చెప్పాలని రంగరాజన్ అభిప్రాయం. కొత్త సంవత్సరం నేపథ్యంలో జనవరి 1వ తేదీ ఉదయాన్నే ఆలయానికి వెళ్లడం సహజం. అలా చిలుకూరు ఆలయానికి వచ్చేవాళ్లలో ఎవరైనా అక్కడ న్యూ ఇయర్ విషెస్ చెబుతూ తారసపడితే వారితో గుంజీలు తీయించడం ఖాయమంటున్నారు రంగరాజన్. న్యూ ఇయర్ వేడుకలు మన సంస్కృతి కాదని,పాశ్చాత్యుల సంస్కృతి అని ఆయన అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మాలను,సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు.

who tells new year wishes in chilkur temple premises they will get punishment says temple priest

చర్చిలు,మసీదులను వదిలేసి కేవలం హిందూ దేవాలయాల నుంచే ఎందుకు పన్నులు వసూలు చేస్తున్నారంటూ గతంలో రంగరాజన్ ప్రభుత్వాలను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. భారత రాజ్యాంగంలోని 27వ ఆర్టికల్ ప్రకారం ధార్మిక సంస్థల నుంచి ఎలాంటి పన్నులు వసూలు చేయరాదన్న నిబంధన ఉన్నప్పటికీ.. ప్రభుత్వాలు ఎందుకు కేవలం దేవాలయాల నుంచే పన్నులు వసూలు చేస్తున్నాయని అప్పట్లో రంగరాజన్ ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+