'అన్నింట్లో ఏపీతో పోల్చుకుంటున్న కెసిఆర్, ఇందులో వెనక్కెందుకో'
హైదరాబాద్: అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కార్మికుల జీతాల విషయంలో మాత్రం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారని వామపక్ష నేత తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు.
మున్సిపల్ కార్మికుల సమ్మె పైన తమ్మినేని ఆదివారం నాడు మాట్లాడారు. అన్ని విషయాల్లో ఏపీతో పోల్చుకునే కెసిఆర్, అక్కడ కార్మికుల జీతాలు పెంచితే ఇక్కడెందుకు అలా చేయలేదని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్ల పైన తగ్గకుంటే తాము 28, 29, 30 తేదీల్లో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.

సమ్మె పైన ప్రభుత్వం మొండి వైఖరి సరికాదన్నారు. ఉస్మానియా ఆసుపత్రి విషయమై విస్తృత స్థాయి చర్చ జరగాలన్నారు. వామపక్షాల నేతలం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి పరిశీలిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల డిజైన్‌ల మార్పు ద్వారా అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు.
పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్పులను పరిశీలిస్తామన్నారు. రీడిజైన్ పైన వామపక్షాల నేతలో ఇంజినీర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టును త్వరలో ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలుపుతామని చెప్పారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications