ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఛత్తీస్‌గడ్‌లోని బస్తర్ ఎన్నికలపై తెలంగాణ ఎందుకు దృష్టి సారించింది..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018: ఛత్తీస్‌గడ్‌ ఎన్నికలపై తెలంగాణ ఆసక్తి

దేశవ్యాప్తంగా జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే ఇప్పుడు అందరి దృష్టి పడుతోంది. 2019 సాధారణ ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక ఆయా రాజకీయ పార్టీలు నేతలు ప్రచారంలో దూసుకెళుతున్నారు. తమ అభివృద్ధి గురించి అధికార పార్టీలు చెప్పుకుంటుంటే .... తాము అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు అభివృద్ధి తీసుకొస్తామో ప్రచారంలో చెబుతున్నాయి విపక్షాలు.

ఛత్తీస్‌గఢ్ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ

ఛత్తీస్‌గఢ్ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ

ఇక నవంబర్ 12న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రంగా ఉంది. తెలంగాణాలో కూడా ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ఛత్తీస్‌గఢ్ ఎన్నికలపై తెలంగాణలోని రాజకీయపార్టీలు దృష్టి సారించాయి. ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు తొలిదశలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన బస్తర్, రాజ్‌నంద్‌గావ్‌లలో జరగనున్నాయి. ఇక ఇక్కడి ఎన్నికలపైనే తెలంగాణ రాజకీయ పార్టీలు చర్చించుకుంటున్నాయి. ప్రత్యేకించి బస్తర్ ఎన్నికలపైనే దృష్టి సారించాయి. ఓ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తెలంగాణలోని ఖమ్మం జిల్లాల్లో బస్తర్ ఎన్నికలపై జోరుగా చర్చజరుగుతున్నట్లు వెల్లడించింది.

ఛత్తీస్‌గఢ్ జర్నలిస్టులతో టచ్‌లో ఉన్న తెలుగురాష్ట్రాల జర్నలిస్టులు

ఛత్తీస్‌గఢ్ జర్నలిస్టులతో టచ్‌లో ఉన్న తెలుగురాష్ట్రాల జర్నలిస్టులు

హైదరాబాద్‌లోని ప్రముఖ పత్రికలు బస్తర్ ఎన్నికలపై చాలా కథనాలు అందిస్తున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఇక ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జర్నలిస్టులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జర్నలిస్టులతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. మొత్తం 90 సీట్లున్న ఛత్తీస్‌గడ్‌లో నవంబర్ 12న 18 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక మిగతా స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఇక డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

తెలంగాణకు కూడా నక్సల్ బెడద ఉంది

తెలంగాణకు కూడా నక్సల్ బెడద ఉంది


తెలుగు రాష్ట్రాల్లో మీడియానే కాకుండా... పోలీసులు, ప్రభుత్వాధికారులు, ఎన్నికల సంఘం అధికారులుతో పాటు సామాన్యులు కూడా నవంబర్ 12న జరగనున్న ఎన్నికలపై దృష్టి సారించారు. అంతేకాదు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారినుంచి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారనేదానిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు వారు ఎన్నికల సందర్భంగా ఏదైనా ముప్పు తలపెడితే వాటిని ఎలా టాకిల్ చేస్తారనేదానిపై కూడా అధికారులను సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు ఏవిధంగా అయితే నక్సలైట్ల నుంచి బెడద ఉందో తెలంగాణ రాష్ట్రానికి కూడా అన్నల బెడద ఉంది. ఇందులో భాగంగానే రెండు రాష్ట్రాల పోలీసలు ఒకరికొకరు సహకరించుకుంటూ ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

English summary
As Chhattisgarh is gearing up for its first phase of election scheduled on November 12, neighbouring Telangana, which is also poll-bound, is also keeping a close watch on the developments in the run-up to the first phase.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X