ఇంకా ఎందుకు: తెలంగాణలో జగన్ వైసిపిని ఎందుకు కొనసాగిస్తున్నారు!?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణను వదిలేసుకున్నారా? తెరాస కోసమే ఇంకా పార్టీని కొనసాగిస్తున్నారా? అంటే కావొచ్చునని అంటున్నారు.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణను వదిలేసుకున్నారా? తెరాస కోసమే ఇంకా పార్టీని కొనసాగిస్తున్నారా? అంటే కావొచ్చునని అంటున్నారు.
చదవండి: జగన్ ఉన్నంత వరకు చంద్రబాబుకు ఢోకా లేదా: తెలుగు తమ్ముళ్లు హ్యాపీ
ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అయినా అప్పుడప్పుడు తెలంగాణ టిడిపిపై దృష్టి సారిస్తున్నారు. పార్టీ బలోపేతం తదితర అంశాలపై సమాలోచనలు జరుపుతున్నారు. నేతలకు సూచనలు ఇస్తున్నారు. కానీ జగన్ మాత్రం అది కూడా చేయడం లేదంటున్నారు.
నేతలకు పదవులు కట్టబెట్టడం వరకే సరిపోతుందని గుర్తు చేస్తున్నారు. కానీ వైసిపి ప్రజా సమస్యలపై పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదంటున్నారు. కేసీఆర్ ప్రభత్వం అధికారంలోకి వచ్చాక కొంత హడావుడి చేసినప్పటికీ.. ఎమ్మెల్యేలు కారు ఎక్కాక అది కూడా తగ్గిందంటున్నారు.

ఇంత వేడిలోను...
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల సమస్యలపై వేడిగా వాడిగా చర్చ సాగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఖమ్మం జిల్లాలోనే వైసిపి సత్తా చాటింది. అదే ఖమ్మం జిల్లాలో మిర్చి సమస్య హీటెక్కింది. కానీ వైసిపి నుంచి ఎలాంటి స్పందన లేదని గుర్తు చేస్తున్నారు. జగన్ ప్రధానంగా ఏపీ పైనే దృష్టి సారించారు.

ఇంకా తెలంగాణలో ఎందుకు?
వైయస్ జగన్ కూడా పూర్తిగా ఏపీ పైనే దృష్టి సారించారు. తెలంగాణ వైసిపి నేతలు ప్రజా సమస్యలపై పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు లేవు. అలాంటప్పుడు ఇంకా పార్టీని తెలంగాణలో ఎందుకు కొనసాగిస్తున్నారనే చర్చ సాగుతోంది.

అధికార పార్టీ కోసమా?
ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశాలున్నాయనే ఊహాగానాలు ఉన్నాయి. ముందస్తు అవకాశాలు కొట్టిపారేసే పరిస్థితి లేదు. లేదా నిర్ణీత సమయం.. 2019లో ఎన్నికలు జరిగినా.. అధికార తెరాస కోసం జగన్ తెలంగాణలో వైసిపిని కొనసాగిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అలాంటప్పుడు అవసరం ఏమిటి?
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓట్ల చీలికతో తెరాసకు లబ్ధి చేకూర్చేందుకే జగన్ ఇంకా పార్టీని కొనసాగిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. 2014 ఎన్నికలకు ముందు కూడా ఇదే ప్రచారం జరిగింది. విభజన నేపథ్యంలో తెలంగాణలోని ఆంధ్రా ప్రజల ఓట్లు చీల్చేందుకు.. తద్వారా టీడీపీకి నష్టం చేసేందుకు వైసిపి తెలంగాణలో ఉందని అంటున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ తెలంగాణతో పాటు ఇక్కడి ఆంధ్రుల మన్ననలు కూడా అందుకుంటున్నారు. అలాంటప్పుడు ఇంకా ఎందుకు జగన్ కొనసాగిస్తున్నారని అంటున్నారు.

వైసిపి కంటే టిడిపి బెట్టర్.. కానీ
జగన్ ఎలాగు ఏపీపై దృష్టి సారించారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణలో చేతులెత్తేస్తే టిడిపి దానిని ఏపీలో లేవనెత్తి విమర్శలు చేసే అవకాశముంది. ప్రస్తుతం తెలంగాణలో టిడిపికి అవకాశం లేదని వైసిపికి అసలే అవకాశం లేదని అంటున్నారు. వైసిపి కంటే మాత్రం టిడిపి చాలా బెట్టర్. కానీ రెండింటికి లైఫ్ లేదని అంటున్నారు. అలాగే, జగన్ గోల్ ఏమిటో అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా పార్టీని ఎత్తేయాల్సిన అవసరం లేదని, పరిస్థితులే అవగతం చేస్తున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications