ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ ఈమెనే (ఫొటో)
హైదరాబాద్: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ ఉదంతం కలకలం సృష్టించింది. ఆమె ప్రియుడితో పాటు ఆమెను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన హైదరాబాదులోని ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారంనాడు జరిగింది.
ఎల్బీనగర్ ఎసిపి వేణుగోపాల్ రావు కథనం ప్రకారం - బండ్లగూడ సమీపంలోని ఫతుల్లాగుడాలో నివసించే తన్నీరు వెంకటేష్ (35), సుశీల (27) దంపతులు. వీరి స్వస్థలం ఒంగోలు జిల్లాలోని సంతనూతలపాడు మండలం వడ్డె పాలెం.
వీరి ఇంటికి సమీపంలో నివసించే గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలోని పెద్దపులివేరుకు చెదిన గొర్రుముచ్చు కోటయ్య అలియాస్ కోటేశ్వర రావు (24) వెంకటేష్ వద్ద మేస్త్రీగా పనిచేసేవాడు. ఇతను సుశీలతో పరిచయం పెంచుకున్నాడు. అనుమానంతో వెంకటేష్ పలుమార్లు భార్య సుశీలను నిలదీశాడు.

ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లిన ఆమె గత నెల 22వ తేదీన సోదరుుడ, పిల్లలతో సహా బస్సులో నగరానికి బయలుదేరింది. తన భర్తను చంపేయాలంటూ ప్రియుడు కోటయ్యతో బస్సులోనే ఫోన్‌లో చెప్పింది. దీంతో ఆ రాత్రి వెంకటేష్‌ను కోటయ్య కర్రతో కొట్టి చంపేశాడు.
ఏమీ తెలియనట్లు ఉదయం ఇంటికి వచ్సి భర్త మృతదేహాన్ని చూసిన సుశీల తన సోదరుని ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. అతనికి ఓ మహిళతో అక్రమ సంబంధం ఉందని పోలీసులకు చెప్పి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది.
అనుమానంతో పోలీసులు ఆమె ఫోన్ కాల్‌డేటాను సేకరించారు. దాంతో అసలు కథ బయటపడింది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications