భర్త చెవుల్లో గడ్డిమందు పోసి చంపేసిన భార్య.. ప్రియుడి కోసం దారుణం

ఒకప్పుడు భార్యలను భర్తలు హతమార్చిన ఘటనలు ఎక్కువగా వినిపించేవి. కానీ ప్రస్తుతం భార్యలు భర్తలను హత మారుస్తున్న తీరు ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలలో సీన్ రివర్స్ చేసింది. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఒక భార్య భర్తను కిరాతకంగా హతమార్చింది. బాగా మద్యం తాగించి భర్త చెవుల్లో గడ్డి మందు పోసి ప్రాణాలు తీసింది. అసలు ఇంతకీ ఆ ఇల్లాలు భర్తను ఎందుకు అంతమొందించింది? అనే వివరాలలోకి వెళితే

భర్త వేధింపులు, వివాహేతర సంబంధంతో భార్య క్రిమినల్ ఆలోచన
కరీంనగర్ కిసాన్ నగర్ కు చెందిన 45 సంవత్సరాల ఐలవేణి సంపత్ గ్రంథాలయంలో స్వీపర్ గా పనిచేసేవాడు అతనికి భార్య రమ, కొడుకు భరత్ ఉన్నారు. సంపత్ మద్యానికి బానిస కావడంతో తరచూ వారి ఇంట్లో గొడవలు జరిగేవి. మద్యం మత్తులో సంపత్ భార్యను కొట్టడం, తిట్టడం, వేధించడం చేసేవాడు. ఇదే సమయంలో భార్య రమకు అదే ప్రాంతానికి చెందిన కర్రే రాజయ్య తో వివాహేతర సంబంధం ఏర్పడింది.

Wife kills husband by pouring pesticide in his ears Atrocity for her lover

Take a Poll

భర్తను హతమార్చాలని నిర్ణయం
ఓపక్క భర్త వేధింపులు, మరోపక్క ప్రియుడు మీద ప్రేమ కారణంగా రమ తన భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. జూలై 29వ తేదీన సంపత్ భార్యతో గొడవపడి ఇంట్లో నుండి బయటకు వెళ్ళాడు. అదే రోజు రాజయ్య తన స్నేహితుడు కీసరి శ్రీనివాస్ కలిసి సంపత్ ను బొమ్మకల్ రైల్వే ట్రాక్ వద్దకు మద్యం పార్టీ ఇస్తామని పిలిచారు.

భర్త చెవుల్లో గడ్డిమందు పోయించి హత్య
సంపత్ మద్యం మత్తులోకి జారుకున్న తర్వాత రాజయ్య, రమకు ఫోన్ చేసి సంపత్ ను హతమార్చడానికి అనుమతి తీసుకున్నాడు. నా భర్తను హతమార్చడానికి ప్రియుడికి అనుమతి ఇవ్వడంతో మద్యం మత్తులోకి జారుకున్న సంపత్ చెవుల్లో గడ్డిమందు పోసి హతమార్చారు. గడ్డిమందు కాస్త మెదడుకు చేరడంతో సంపత్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

తండ్రి మృతిపై కొడుకు అనుమానం
ఇక హత్య తర్వాత రమ, రాజయ్య, కొడుకు భరత్ కలిసి సంపత్ కోసం వెతికినట్టు డ్రామా ఆడారు. కొడుకును నమ్మించడానికి కొడుకుతో కలిసి భర్త కోసం వెతుకుతున్నట్టు రమ నటించింది. ఆగస్టు 2వ తేదీన సంపత్ మృతదేహం లభ్యం కావడంతో తండ్రి మృతి పైన అనుమానం వ్యక్తం చేసిన భరత్ ఫిర్యాదు చేశాడు.

భర్తను ప్రియుడు, అతని స్నేహితునితో కలిసి హతమార్చిన భార్య
భరత్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు వారింట్లో జరుగుతున్న గొడవలు రమ ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఆమెను గట్టిగా ప్రశ్నించారు. దీంతో రమ తను, తన ప్రియుడు, అతని స్నేహితునితో కలిసి తన భర్తను హతమార్చినట్టు అంగీకరించింది. దీంతో ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి హాజరు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వీరికి రిమాండ్ విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+