తెలంగాణ ఎన్నికలపై ఏపీ కుల సర్వే ఎఫెక్ట్ ! కాంగ్రెస్ హామీతో లెక్క మారుతుందా ?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల పోలింగ్ కు దాదాపు నెల రోజుల సమయం ఉంది. అసలే రాష్ట్రంలో ఈసారి అధికార బీఆర్ఎస్ కూ, విపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూ మధ్య గట్టి పోటీ నెలకొంది. అదే సమయంలో ఇరు పార్టీలు కూడా పోటాపోటీగా సంక్షేమ హామీలు గుప్పించాయి. అయితే ఇవన్నీ ఓ ఎత్తయితే ఏపీలో నవంబర్ 15న మొదలు కాబోతున్న కుల సర్వే మరో ఎత్తుగా మారబోతోంది.
దేశవ్యాప్తంగా కుల సర్వేకు ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో తమ కూటమిలోని పార్టీలు అధికారంలో న్న బీహార్ లో కులాల సర్వే చేపట్టడమే కాకుండా ఫలితాలను కూడా ప్రకటించేసింది. తద్వారా వచ్చే లోక్ సభ ఎన్నికలకు కీలక అస్త్రాన్ని ఇండియా కూటమి సిద్దం చేసుకుంది. ఇదంతా చూస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ కూడా ఎన్నికలకు ముందే రాష్ట్రంలో కులాల సర్వే చేపట్టేందుకు సిద్ధమవుతోంది. నవంబర్ 15 న కుల సర్వే చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

దీని ప్రబావం పొరుగున ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణపై అనివార్యంగా పడుతోంది. ఇప్పటికే తెలంగాణలో కులాల ర్వే నిర్వహించాలంటూ కేసీఆర్ ప్రభుత్వంపై కొంతకాలంగా బీసీ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు ముందు ఈ తేనెతుట్టె కదపడం ఎందుకన్న భావనలో ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఎన్నికల్లో అదే సమస్యగా మారబోతోందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఓవైపు ఏపీలో నవంబర్ 15న కుల సర్వే మొదలై, ఇటు కాంగ్రెస్ పార్టీ తమకు అధికారమిస్తే కుల సర్వే చేపడతామని హమీ ఇవ్వడం బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారబోతోంది.
ఓవైపు ఇండియా కూటమిని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో ఘనవిజయం తర్వాత తెలంగాణలో పాజిటివ్ లోకి వచ్చేసింది. అంతే కాదు వచ్చే ఎన్నికల్లోనూ కొత్త అస్త్రాలేవీ లేకుండానే గెలిచినా ఆశ్చర్యం లేదు. అలాంటి పరిస్దితుల్లో ఇంజడియా కూటమి అస్త్రమైన కుల సర్వే డిమాండ్ ను తమకు అధికారమిస్తే నెరవేరుస్తామని కూడా చెబుతోంది. దీంతో బీసీల మద్దతు తమకే ఉండేలా చూసుకుంటోంది. అదే జరిగితే తెలంగాణలో దాదాపు 139 బీసీ కులాలు కాంగ్రెస్ కు అండగా నిలిచే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications