టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వల- చంద్రబాబు పాత ప్లాన్ బీజేపీకి పనికొస్తుందా ? అది మాత్రం ఊరటే !
2015లో హైదరాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ స్టీఫెన్ కు డబ్బులిస్తూ రేవంత్ రెడ్డి దొరికిపోయిన వ్యవహారంలో చంద్రబాబు పీకల్లోతు ఇరుక్కుపోయారని అంతా భావించారు. దీంతో ఆయన రాజకీయ జీవితం కూడా ముగిసిపోయిందనుకున్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ పేరుతో చంద్రబాబు చేసిన ఎదురుదాడి కేసీఆర్ ను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. చివరికి చంద్రబాబు ఏపీకి మకాం మార్చేసి బయటపడ్డారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారంలోనూ బీజేపీకి చంద్రబాబు వ్యూహమే పనికొచ్చేలా కనిపిస్తోంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర
తెలంగాణలో టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలను బీజేపీలోకి ఆకర్షించేందుకు ఇద్దరు స్వాములు హైదరాబాద్ లోని ఓ హోటల్ యజమానితో కలిసి ప్లాన్ చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో సైబరాబాద్ పోలీసులు దాడి చేసి ఈ ఆపరేషన్ ఆకర్ష్ గుట్టు రట్టు చేశారు. ఈ సమయంలో బీజేపీలోకి ఈ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రప్పించేందుకు భారీగా డబ్బు, పదవులు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విషయంతెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని దాదాపు గంటన్నరసేపు గుట్టుగా వీడియో రికార్డ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం వీడియో సాక్షిగా బట్టబయలైంది.

చంద్రబాబు ఓటుకు నోటు తరహాలోనే
2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బులిస్తూ అప్పటి టీడీపీ నేత, ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వీడియోకు చిక్కారు. అదే సమయంలో ఆయన చంద్రబాబుతో స్టీఫెన్ సన్ ను మాట్లాడించిన ఆడియో, వీడియోలు బయటికి వచ్చాయి. ఈ ఎపిసోడ్ లోనూ కేసీఆర్ పోలీసుల్ని పంపి ఈ ఆపరేషన్ ఆకర్ష్ ను పట్టుకున్నారు. కానీ ఆ తర్వాతే అసలు ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు ఈ విషయంలో చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారన్న ఆవేదన కేసీఆర్ కు తప్పలేదు. అయినా చేసేదేమీ లేకపోయింది.

చంద్రబాబు వ్యూహమా మజాకా ?
అయితే ఓటుకు నోటు కేసులో తన పార్టీ నేత రేవంత్ రెడ్డి డబ్బులిస్తూ వీడియోకు దొరికినా, ఆడియోలో తాను మాట్లాడినట్లు ఉన్న రికార్డు బయటపడినా చంద్రబాబు మాత్రం ఓటుకు నోటు కేసు నుంచి సేఫ్ గా బయటపడ్డారు. దీనికి కారణం ఆయన ఎంచుకున్న ఎదురుదాడి వ్యూహమే. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన ఎంచుకున్న ఎదురుదాడి వ్యూహం ఫలించింది. కేసీఆర్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేయడం నిబంధనలకు విరుద్ధమంటూ కొత్త వాదన లేవనెత్తిన చంద్రబాబు, ఉమ్మడి రాజధానిలో సెక్షన్ 8 అమలు చేయడం ద్వారా ఏపీ ప్రభుత్వ పెద్దలకు రక్షణ కల్పించాలని కేంద్రంలో బీజేపీ సర్కార్ ను కోరారు. అప్పట్లో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లో భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేతగా చంద్రబాబు వాదనను ప్రధాని మోడీ మన్నించేలా కనిపించారు. చివరికి ఏం జరిగిందో ఏమో కానీ చంద్రబాబు మాత్రం సేఫ్ గా బయటపడిపోయారు. దీంతో ఆయన ఏపీకి మకాం మార్చేశారు.

బీజేపీకి చంద్రబాబు ప్లాన్ పనికొస్తుందా ?
అప్పట్లో చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ పేరుతో చేసిన ఎదురుదాడి వ్యూహం ఫలించింది. అదే సమయంలో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేస్తామని, కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామన్న హెచ్చరికలు కూడా పనిచేసాయి. ఇప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు ఈసారి కూడా బీజేపీకి అవకాశం ఉంది. అది ఫోన్ ట్యాపింగ్ పేరుతోనా, లేక సీబీఐ విచారణ పేరుతోనా, లేక మరేఇతర మార్గంలోనా అన్నది తేలాల్సి ఉంది. కానీ బీజేపీ కూడా చంద్రబాబు తరహాలోనే ఎదురుదాడికి మాత్రం సిద్దమవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ఈ వ్యూహం బీజేపీకి రాజకీయంగా పనికొస్తుందా, మునుగోడులో గెలుపోటముల్ని ఇది ప్రభావితం చేస్తుందా లేదా అన్నది మాత్రం త్వరలో తేలిపోనుంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ నేతలు నేరుగా దొరికిపోకపోవడం మాత్రం కాస్త ఊరట.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications