హైదరాబాద్ వాసులకు బెస్ట్ టూరిస్ట్ స్పాట్.. ఆ విశేషాలు ఏంటి..?

హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. చారిత్రక కట్టడాలు నెలకుని ఉన్నాయి. భాగ్యనగర వాసులకు నిత్యం ఆహ్లాదాన్ని, సంతోషాన్ని పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పలు పార్కులను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ క్రమంలో కొత్వాల్ గూడలోని ఎకో పార్క్ పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. అన్ని సౌకర్యాలతో 85 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంది. ఈ ఎకో పార్కులోనే అతి పెద్ద పక్షి శాలను నిర్మించారు. అలాగే దేశంలోనే అతిపెద్ద ఎక్వేరియం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.

కొత్వాల్ గూడ ఎకో పార్క్.. పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. పిల్లలు, పెద్దలు వారాంతాల్లో ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా ఈ పార్కును అభివృద్ధి చేశారు. ఔటర్ రింగ్‌ రోడ్డు పరిధిలోని హిమాయత్ సాగర్‌ పక్కన 85 ఎకరాల్లో హెచ్‌ ఎండీఏ ఎకో పార్కును రూపొందించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన దాదాపు 15వందల రకాల పక్షులకు ఇక్కడ నిలయంగా ఉంది. అలాగే ఇక్కడ సాహస క్రీడలను పెంపొందించేందుకు వీలుగా.. జిప్‌ లైన్, క్లైంబింగ్‌ వాల్‌, స్కై బ్రిడ్జి, రోలర్‌ కోస్టర్‌, జాయింట్‌ స్వింగ్, 360 డిగ్రీస్ ఫ్లయింగ్‌ సైకిల్‌, సస్పెన్షన్‌ బ్రిడ్జి, బంగీ ట్రంప్‌ లైన్‌.. తదితర క్రీడలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వారాంతాల్లో యువత, పిల్లలు.. ఈ క్రీడలను ఆస్వాదించవచ్చు.

Wings of Wonder How Kotwal Guda s Eco Park is Turning Hyderabad into a Bird Lover s Paradise

అలాగే ఈ ఎకో పార్కులో అతిపెద్ద పక్షి శాలను ఏర్పాటు చేశారు. ఈ అతిపెద్ద పక్షిశాల దాదాపు ఆరు ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడికి ఆస్ట్రేలియా, అర్జెంటీనా, అమెరికా, చైనా, జపాన్ కు చెందిన 200-300 రకాల పక్షులను తీసుకొచ్చి ఉంచారు. పర్యటకులను ఇవి ఆకట్టుకుంటున్నాయి. ఇక సముద్ర జీవుల కోసం అతిపెద్ద అక్వేరియం అందుబాటులోకి తెచ్చారు. పిక్నిక్ పార్క్, అడ్వంచర్స్ జోన్, ఫుడ్ కోర్టులను కూడా ఏర్పాటు చేశారు. నగరంలో తొలిసారిగా అండర్ వాటర్ టన్నెల్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్టార్ ఫిష్, ఏంజెల్ ఫిష్, ఈల్స్, సీ- హార్స్ ఇలా దాదాపు 3 వేల చేపలను టన్నెల్ ఎక్వేరియంలో కన్నుల పండగలా వీక్షించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+