భర్త టిఫిన్ చేయలేదని గృహిణి ఆత్మహత్య

హైదరాబాద్: భర్త అల్ఫాహారం చేసి వెళ్లలేదని తీవ్ర మనస్తాపానికి గురైన గృహిణి ఫ్యాన్‌కు ఉరేసుకుది. హైదరాబాదులోని మార్కండేయనగర్‌కు చెందిన ఉష(28), సంతోష్‌ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు. భర్త సంతోష్‌ ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

సోమవారం ఉదయం టిఫిన్‌ చేయడం ఆలస్యం కావడంతో సంతోష్‌ బయటకు వెళ్లిపోయాడు. దీంత తీవ్ర మనస్తాపానికి గురైన ఉష మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య

Woman commits suicide in Rangareddy district

ఇదిలావుంటే, గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య చేసుకుంది. నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందిన రమావత్‌ మోతీలాల్‌ గ్రేహౌండ్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

అతడు సోమవారం విధులకు హాజరుకాగా, మంచిరేవులలోని క్వార్టర్స్‌లో ఉంటున్న భార్య రమావత్‌మౌనిక(30) ఫ్యాన్‌కు ఉరేసుకుంది. మానసికస్థితి సరిగా లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నార్సింగ్‌ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+