మహిళా హోంగార్డుపై అత్యాచారం, దారుణ హత్య

మృతురాలు హైదరాబాద్ రేంజ్ ఐజీ కింద హోంగార్డుగా పనిచేస్తున్న నవనీతగా(40)గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ఐడీ కార్డుతో మృతురాలి వివరాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలికి పోలీసులు క్యూస్‌టీం చేరుకుని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విషయం బయటపడుతుందనే భయంతో దుండగులు అత్యాచారం చేసిన తర్వాత ఆమెను హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఆమెను ఎక్కడి నుంచైనా అపహరించి అటవీ ప్రాంతానికి తీుసకుని వచ్చారా, లేదంటే నిందితులతో ఆమెకు ముందే పరిచయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విమానాశ్రయంలో బంగారం పట్టివేత
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 666 గ్రాముల బంగారం పట్టుబడింది. శుక్రవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి కస్టమ్స్ అధికారులు ఈ బంగారాన్ని












Click it and Unblock the Notifications