నడిరోడ్డుపై యువతి రచ్చ: బండబూతులతో విరుచుకుపడింది..
నగరంలోని బేగంపేటలో ఓ యువతి నడిరోడ్డుపై హల్ చల్ చేసింది. మితిమీరిన వేగంతో రోడ్డుపై మిగతా వాహనాదారులను బెంబేలెత్తించిన ఆమె.. ర్యాష్ డ్రైవింగ్ పై ప్రశ్నించినందుకు ట్రాఫిక్ పోలీసుల పైనే వీరంగం చేసింది.
Recommended Video

Woman Rash Driving on Begumpet Roads : VIDEO ర్యాష్ డ్రైవింగ్ తో మహిళ హల్ చల్ !| Oneindia Telugu
హైదరాబాద్: నగరంలోని బేగంపేటలో ఓ యువతి నడిరోడ్డుపై హల్ చల్ చేసింది. మితిమీరిన వేగంతో రోడ్డుపై మిగతా వాహనాదారులను బెంబేలెత్తించిన ఆమె.. ర్యాష్ డ్రైవింగ్ పై ప్రశ్నించినందుకు ట్రాఫిక్ పోలీసుల పైనే వీరంగం చేసింది.
అక్కడే ఉన్న వాహనదారులను నోటికొచ్చినట్టు బండబూతులు తిట్టింది. యువతి వేగాన్ని గమనించి వాహనదారులు పక్కకు తప్పుకోబట్టి సరిపోయింది కానీ లేదంటే ఎవరు బలయ్యేవారో. ఓ వాహనదారుడు ఈ వీడియో తీయడంతో వ్యవహారం బయటకొచ్చింది.

బేగంపేట నుంచి సదరు యువతి సైనిక్ పురి వైపుగా వెళ్లినట్లు సమాచారం. అయితే ఆ యువతి ఎవరనేది మాత్రం తెలియరాలేదు. పోలీసులు కూడా ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.












Click it and Unblock the Notifications