బెదిరించి ప్రేమించేలా చేసుకున్నాడు, ఇప్పుడు మొహం చాటేశాడు

నాగర్‌కర్నూలు: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆ తర్వాత తనను మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. ఏడాదిగా తన వెంట పడ్డాడని ఆ యువతి ఆరోపిస్తోంది.

తాను అంగీకరించకపోవడంతో చివరకు కుటుంబాలకు ప్రాణహానీ తలపెడతానని బెదిరించి లొంగదీసుకున్నాడని చెప్పింది. కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో ఇద్దరికి ఐదు నెలల క్రితం నిశ్చితార్థం చేశారని పేర్కొంది.

 మొహం చాటేశాడు

మొహం చాటేశాడు

కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకునేందుకు మొహం చాటేశాడని ఆ యువతి ఆరోపిస్తోంది. ఈ సంఘటన నారాయణపేట మండలంలో చోటు చేసుకుంది. సమాచారం మేరకు ఓ రాథోడ్ పరమేష్, శేర్నపల్లి పరిధిలోని కొత్తపల్లి తండాకు చెందిన చౌహాన్ మంగ్లీబాయి కుటుంబాలు ముంబైకి వలస వెళ్లాయి.

 ఏడాదిగా వెంటపడ్డాడు

ఏడాదిగా వెంటపడ్డాడు

భవన నిర్మాణ పనుల్లో దినసరి కూలిగా పని చేస్తున్న పరమేష్ ఏడాది క్రితం నుంచి వెంటపడుతున్నాడు. అమ్మాయి వద్దని చెప్పినప్పటికీ వినకుండా కుటుంబ సభ్యులకు ప్రాణహానీ తలపెడతానని బెదిరించి లొంగదీసుకున్నాడు. ఇద్దరు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

 నిశ్చితార్థం అయింది

నిశ్చితార్థం అయింది

ఐదు నెలల క్రితం రెండు కుటుంబాలను ఒప్పించారు. నిశ్చితార్థం కూడా అయింది. కానీ కొద్ది రోజులుగా యువకుడు మొహం చాటేశాడు. ఫోన్లో కూడా మాట్లాడటానికి అందుబాటులో లేడు.

కేసు పెట్టిన పోలీసులు

కేసు పెట్టిన పోలీసులు

దీంతో గురువారం యువతి, ఆమె బంధువులు, స్థానికులు ప్రేమించిన యువకుడి ఇంటి ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చారు. అతనిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+