టీఆర్ఎస్ అభ్యర్థి ఓట్లు అడిగేందుకు వెళితే ఏమైందో తెలుసా..?
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రచారానికి వెళ్లిన కొందరి నేతలను ప్రజలు అక్కున చేర్చుకుంటుంటే మరికొందరికి మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మరికొందరికి విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. జూబ్లీహిల్స్ తాజా మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.
జూబ్లీ హిల్స్ తాజా మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అయితే అక్కడ ఆయనకు ఓ మహిళ నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఓటు అడిగేందుకు వెళ్లిన గోపీనాథ్‌ను మహిళ నిలదీసింది. తమ సమస్యలను పరిష్కారించలేదని అసలు ఏం పరిష్కారం చేశారని మహిళ నిలదీయడంతో గోపీనాథ్ ముఖం చిన్నబోయింది. అందుకు సమాధానంగా గోపీనాథ్.. రోడ్డు మీద కాదు తర్వాత రావాల్సిందిగా కోరారు. తమ వారు చాలాసార్లు సమస్యలతో వచ్చారని అయితే పట్టించుకున్న నాధుడే లేడని మహిళ వాపోయింది. మహిళ ముఖం మీదనే నిలదీయడంతో గోపీనాథ్ అక్కడి నుంచి చిన్నగా జారుకున్నారు.
సమస్యలు పరిష్కరించలేని మీకు ఓటు ఎందుకు వేయాలని మహిళ గట్టిగా అడిగింది. ఈసారి టీఆర్ఎస్‌కు ఓటు వేసేది లేదని ఇతరులకు కూడా ఓటు వేయొద్దని చెబుతామని మహిళ చెప్పింది. గోపీనాథ్, మహిళ మధ్య వాగ్వాదాన్ని అక్కడే ఉన్నవారు తమ కెమెరాల్లో బంధించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. మాగంటి గోపీనాథ్ 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీచేసి గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలోకి మారారు. గోపీనాథ్ మహిళ మధ్య ఎలాంటి వాగ్వాదం జరిగిందో మీరు చూడండి.













Click it and Unblock the Notifications