కేసీఆర్ ఇలాకాలో నీటి కోసం ధర్నా
గజ్వెల్: మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామనే ఆవేదనతో ఆగ్రహించిన మహిళలు ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సోంత నియోజకవర్గాలోని గజ్వేల్ నగర పంచాయతిలోని ప్రజ్ఞాపూర్ లో గత కొన్ని రోజులనుండి నీటి సరపరా లేదని.. తమ సమస్యలను అధికారుల పట్టించుకోవడంలేదన్నారు. మిషన్ భగీరద లో ఇంటింటికి మంచి నీరు అందిస్తామని నాయకులు చెబుతున్న అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.సాక్షాత్తు ప్రధానమంత్రే ఇక్కడ పథకం ప్రారంభించినప్పటికీ.. ఇక్కడే పథకం నీరుగారుస్తున్నారని వారు వాపోయారు. నీటి సమస్యను పరిష్కరించకుండా తాత్కాలికంగా పనులు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications