లలితా జువెల్లరీలో చోరీ: రూ.6లక్షల మాయం, బురఖాలో వచ్చి..
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట లలితా జ్యువెలర్స్‌లో రూ.6లక్షల విలువైన హారం చోరీకి గురైంది. పంజాగుట్ట డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపిన ప్రకారం.. డిసెంబర్ 3న లలితా జ్యువెలర్స్‌కు ఇద్దరు మహిళలు బురఖా ధరించి ఆభరణాల కొనుగోలు చేసేందుకు వచ్చారు.
బంగారు హారం కావాలని అక్కడున్న సిబ్బంది అడిగారు. వారు చూపిస్తుండగా మాటల్లో పెట్టి బాక్స్‌లోని హారం చూస్తున్నట్లు నటించి తస్కరించారు. అనుమానం రాకుండా వారి వెంట తీసుకొచ్చిన రోల్డ్‌గోల్డ్ హారాన్ని బాక్సులో పెట్టి.. బేరం కుదరలేదని అక్కడి నుంచి జారుకున్నారు.

కాగా, డిసెంబర్ 7న ఆడిట్ సందర్భంగా సీసీటీవీ దశ్యాలను పరిశీలించిన సిబ్బంది బంగారు ఆభరణం చోరీకి గురైనట్టు గుర్తించారు. దీనిపై మేనేజర్ మధుసుదన్ శనివారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దశ్యాలను పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఐ తెలిపారు. కాగా, 'డబ్బులు ఊరికే రావు' అంటూ లలితా జ్యువెల్లర్స్ యజమాని కిరణ్.. తానే బ్రాండ్ అంబాసిడర్‌గా వినూత్న ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications