మహిళలకు త్వరలో రూ.2500, నిరుద్యోగులకు, పించన్ లబ్దిదారులకు పండుగ చేసుకునే వార్త!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో రాజకీయ ప్రముఖులు సంక్రాంతి సంబరాలలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు. కుటుంబంతో సంతోషంగా గడపటంతో పాటు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి, వారికి శుభవార్త చెప్పారు. తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

హామీల అమలుపై మంత్రి గుడ్ న్యూస్
ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే పనిలోనే ఉన్నామని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలకు అధిక ప్రాధాన్యతనిచ్చిందని అన్నారు. ఇప్పటికే వాటిలో నాలుగు విజయవంతంగా అమలు చేసిందని ఆయన వెల్లడించారు. మిగిలిన రెండు హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తామని ఆయన గుడ్ న్యూస్ చెప్పారు.

Women will soon get 2500 and there s festive news for the unemployed and pension beneficiaries

Take a Poll

రాజీవ్ యువ వికాసం, 4వేల పించన్ పెంపుపై తీపి కబురు
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలిగేలా తనపై శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కోరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగు ఇప్పటికే సమర్ధవంతంగా అమలైనట్లు చెప్పిన ఆయన రాజీవ్ యువ వికాసం, మహిళలలకు నెలకు 2500రూపాయలు, పించన్ మొత్తం పెంపు వంటి హామీలను త్వరలోనే అమలు చేస్తామని అన్నారు.

తమ హయాంలో కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇస్తున్నాం
గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వటమే కాదు, రేషన్ కూడా, అదీ సన్నబియ్యం ఇస్తుందని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి మరోసారి స్పష్టం చేశారు.

మహిళలకు త్వరలో 2500రూపాయలు ఇవ్వనున్న రేవంత్ సర్కార్
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటివి ఇప్పటికే అమలవుతున్నాయి.మహాలక్ష్మి పథకంలో భాగంగా18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం హామీ ఇంకా అమలు కావాల్సి ఉంది, విద్యార్థులు, నిరుద్యోగులకు రూ5 లక్షల సహాయం చేస్తామని ఇచ్చిన హామీ ఇంకా అమలు కావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+