year ender 2024: హైదరాబాదీలు ఈ ఏడాది ఫుల్లుగా కుమ్మేసిన ఫుడ్స్ ఇవే!
2024 సంవత్సరం ముగియబోతోంది. త్వరలో 2025 సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఇక 2024 సంవత్సరంలో ఏం చేశాము? జరిగిన ముఖ్య సంఘటనలు ఏమిటి? వంటి అనేక విషయాలను తెలుసుకునే క్రమంలో హైదరాబాదులో 2024లో చేసిన ఫుడ్ ఆర్డర్స్ ప్రతి ఒక్కరికి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. హైదరాబాదీలు 2024 లో ఫుడ్ ఆర్డర్స్ ఏమి ఎక్కువగా చేశారు? ఏవి ఎక్కువగా తిన్నారు? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాదీలు ఈ ఏడాది ఏం ఎక్కువగా తిన్నారంటే
"హౌ హైదరాబాద్ స్విగ్గిడ్" అనే నివేదికలో హైదరాబాద్లో ఈ సంవత్సరం ఏమేం తిన్నారు అన్నదానిపైనా ఆసక్తి విషయాలు బయటపడ్డాయి. 2024 సంవత్సరంలో కూడా హైదరాబాదీలు బిర్యానీ పైనే బోలెడు ప్రేమ చూపించారు. 2024 లో హైదరాబాదీలు సుమారు 1. 57 కోట్ల బిర్యానీ ఆర్డర్లు చేయగా ప్రతి నిమిషానికి 34 బిర్యానీ లను ఆర్డర్ చేసినట్టు నివేదిక ద్వారా వెల్లడైంది.

చికెన్ బిర్యానీలను కుమ్మేసిన హైదరాబాదీలు
ఇక చికెన్ బిర్యాని ల విషయానికి వస్తే 2024 సంవత్సరంలో హైదరాబాదులో ఏకంగా 97.21 లక్షల చికెన్ బిర్యాని ప్లేట్లు ఆర్డర్ అయ్యాయని నివేదిక వెల్లడించింది. అలా చూస్తే ప్రతి నిమిషానికి 21 చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకే ఆర్డర్ లో 60 బిర్యానీ ల కోసం 18,840 వెచ్చించిన వ్యక్తి కూడా ఉన్నారు అంటే బిర్యానీ మీద హైదరాబాదీలకు ఉన్న ప్రేమ అర్థమవుతుంది.
ఈ స్వీట్ తెగ తిన్న హైదరాబాదీలు
ఈ సంవత్సరం స్విగ్గిలో మొత్తం నాలుగు లక్షల 46 వేల చికెన్ బిర్యానీలను ఆర్డర్ చేసినట్టుగా కూడా నివేదిక వెల్లడించింది. ఇక t20 ప్రపంచ కప్ సమయంలో 8 లక్షల69 వేల ప్లేట్ల చికెన్ బిర్యాని హైదరాబాదీలు తిన్నట్టు తెలుస్తుంది. ఇక హైదరాబాదీల కు ఇష్టమైన స్వీట్ విషయానికి వస్తే డబుల్ కా మీఠా ఈ సంవత్సరం ఎక్కువ మంది తిన్న స్వీట్ గా నిలిచింది.
బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా తిన్నది ఇదే
ఇక బ్రేక్ ఫాస్ట్ విషయానికి వస్తే హైదరాబాదీలు అల్పాహారం లో ఎక్కువగా దోసెలను ఇష్టపడుతున్నారని అందులో ముఖ్యంగా ఉల్లి దోశ పైనే వారు ఎక్కువగా మక్కువ చూపి ఆర్డర్ చేసుకున్నారని స్విగ్గి వెల్లడించింది. దేశంలోనే ఉదయం దోసెను ఎక్కువ ఆర్డర్ చేసింది హైదరాబాద్ వాసులేనని నివేదిక ద్వారా స్పష్టమైంది. మొత్తంగా హైదరాబాదీలు ఈ సంవత్సరం కూడా బిర్యానీని కుమ్మేసారని తాజా నివేదిక స్పష్టం చేసింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications