అక్రమ బంధం ప్రాణం తీసింది: 6వ అంతస్తు నుంచి పడి నటుడు ప్రశాంత్ మృతి(పిక్చర్స్)
హైదరాబాద్: ఓ మహిళతో ఏర్పడిన వివాహేతర సంబంధం యువ నటుడి ప్రాణాల తీసింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన ఆ హీరో..ఆమె కుటుంబసభ్యులకు దొరికిపోతానేమోనని అపార్టుమెంటు ఆరో అంతస్తు నుంచి నుంచి పైప్ సహాయంతో కిందికి దిగడానికి ప్రయత్నించి జారి పడి మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా గుంతకల్ ప్రాంతానికి చెందిన సుందర్‌రాజ్ కుమారుడు బాల ప్రశాంత్(25) రెండేళ్లుగా కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని మూసాపేట్ అంజయ్యనగర్‌లో నివాసముంటున్నాడు. కొన్ని నెలల క్రితం ఓ యువతితో పెళ్లి కుదిరింది. అదే అమ్మాయితో కలిసి కొంత కాలంగా అంజయ్యనగర్‌లో ఉంటూ సినిమా పరిశ్రమలో పనిచేస్తున్నాడు.
ఈ ఏడాది ఆగస్టులో లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు' సినిమాలో హీరోగా చేశాడు. ఇదిలా ఉండగా అంజయ్యనగర్‌లో ఉంటున్న బాల ప్రశాంత్ వద్దకు పవర్‌నగర్, మాధవి మాన్‌షన్, ఫ్లాట్ నెంబరు 601లో నివాసం ఉంటున్న ఓ చిన్నారి డ్యాన్స్ నేర్చుకునేందుకు వచ్చేది.
ఈ క్రమంలో ఆమె తల్లితో ప్రశాంత్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. గురువారం రాత్రి ఆమె భర్త కంపెనీ పనిమీద ఊరికి వెళ్లాడు. దీంతో బాల ప్రశాంత్ ఆమెను కలవడానికి ఇంటికి వెళ్లాడు. కాగా, ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటుంది కాబట్టి, తోడుగా ఉండమని ఒకరికి చెప్పాడు ఆమె భర్త. అయితే, ఇంటికి వెళ్లిన అతడ్ని సదరు మహిళ తాను ఒక్కదాన్నే ఉంటాను, పర్వాలేదని చెప్పి తిరిగి పంపించింది.
ఇదే విషయాన్ని అతడు ఆమె భర్తకు ఫోన్ చేసి చెప్పాడు. అనుమానం వచ్చిన అతడు సమీపంలో ఉంటున్న తన సోదరికి సమాచారం అందించి ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లి తలుపు కొట్టారు. తన వివాహేతర సంబంధం బయట పడుతుందని భావించిన ఆమె.. కత్తితో తన చేయి కోసుకుంది. తనతో పాటు ఉన్న బాలప్రశాంత్‌ను ఇంట్లోని మంచం కింద దాచింది.
తాను ఒక్కతే బయటికి వచ్చి, తనను అనుమానించి అవమాన పరిచారని అందుకే చేయి కోసుకున్నానని కేకలు పెట్టింది. చేతి నుంచి తీవ్ర రక్తం వస్తుండటంతో వారు కూకట్‌పల్లిలోని ఓ ప్రవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే సమయంలో ఆ ఇంటికి తాళం వేశారు.
ఆస్పత్రిలో ఉన్న సదరు మహిళ ఇంట్లో ఉన్న బాల ప్రశాంత్ బయటికి వచ్చేందుకు ప్రయత్నించాడు. కాగా, ‘నేను వస్తాను భయపడకు' అంటూ అతనికి ఆమె ఎస్‌ఎంఎస్‌లు పంపించింది. భయంతో ఉన్న బాల ప్రశాంత్ తాను బాల్కాని నుంచి కిందికి దిగి వెళ్లి పోతున్నట్టు తిరిగి ఎస్‌ఎంఎస్ పంపాడు.
ఈ క్రమంలో పెంట్ హౌజ్ బాల్కని నుంచి డ్రైనేజీ పైప్ సహాయంతో కిందికి దిగడానికి ప్రయత్నిస్తూ.. ఆరో అంతస్తు నుంచి కింద పడి అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు అతని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

నటుడు ప్రశాంత్ మృతి
ఓ మహిళతో ఏర్పడిన వివాహేతర సంబంధం యువ నటుడి ప్రాణాల తీసింది.

నటుడు ప్రశాంత్ మృతి
ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన ఆ హీరో..ఆమె కుటుంబసభ్యులకు దొరికిపోతానేమోనని అపార్టుమెంటు ఆరో అంతస్తు నుంచి నుంచి పైప్ సహాయంతో కిందికి దిగడానికి ప్రయత్నించి జారి పడి మృతి చెందాడు.

నటుడు ప్రశాంత్ మృతి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా గుంతకల్ ప్రాంతానికి చెందిన సుందర్‌రాజ్ కుమారుడు బాల ప్రశాంత్(25) రెండేళ్లుగా కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని మూసాపేట్ అంజయ్యనగర్‌లో నివాసముంటున్నాడు.

అపార్ట్‌మెంట్
కొన్ని నెలల క్రితం ఓ యువతితో పెళ్లి కుదిరింది. అదే అమ్మాయితో కలిసి కొంత కాలంగా అంజయ్యనగర్‌లో ఉంటూ సినిమా పరిశ్రమలో పనిచేస్తున్నాడు.

నటుడు ప్రశాంత్ మృతి
ఈ ఏడాది ఆగస్టులో లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు' సినిమాలో హీరోగా చేశాడు.

నటుడు ప్రశాంత్ మృతి
ఇదిలా ఉండగా అంజయ్యనగర్‌లో ఉంటున్న బాల ప్రశాంత్ వద్దకు పవర్‌నగర్, మాధవి మాన్‌షన్, ఫ్లాట్ నెంబరు 601లో నివాసం ఉంటున్న ఓ చిన్నారి డ్యాన్స్ నేర్చుకునేందుకు వచ్చేది. ఈ క్రమంలో ఆమె తల్లితో ప్రశాంత్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.












Click it and Unblock the Notifications