మిస్టరీగా యువ ప్రేమ జంట ఆత్మహత్య.. అసలు కారణం అదేనా ?

క్షణికావేశం, పరిపక్వత లేని వయస్సు.. ఈ ఇద్దరి మరణానికి కారణం అయ్యింది. తమ ప్రేమను కుటుంబ సభ్యులు ఒప్పుకోరనే అనుమానమో, భయమో కారణం ఏదైనా కానీ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని.. తమ ప్రాణాలను విడిచారు. అయితే అసలు తమ కుటుంబ సభ్యులు మాత్రం వారి ప్రేమ విషయమే తెలియదని చెబుతుండడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. దీంతో అసలు వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఆ స్టోరీ ఏంటి.. లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది..? తెలుసుకుందాం....

పరిచయం.. ప్రేమ..

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని రాచపల్లికి చెందిన రాహుల్.. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫెయిల్ అయ్యి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఎరువచింతలకి చెందిన గోలేటి శ్వేత కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో బిఏ మొదటి సంవత్సరం చదువుతుంది. వీరిద్దరికీ ఓ ఈవెంట్లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమ చిగురించింది.

young-couple-suicide-issue-became-a-mystery-in-telangana

అయితే గత శివరాత్రి నాడు ఇంటికి వెళ్లిన శ్వేత తిరిగి కరీంనగర్ కళాశాలకు చేరుకుంది. రాహుల్ సప్లమెంటరీ ఎగ్జామ్ రాయడానికి స్వగ్రామానికి వచ్చాడు. పరీక్ష రాసిన అనంతరం ఆదివారం సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లిన రాహుల్ అప్పటికే కరీంనగర్ నుండి జమ్మికుంటకు వచ్చి శ్వేతను కలిశాడు. తమ ప్రేమ విషయం తెలిస్తే కుటుంబ సభ్యులు ఒప్పుకోరని ఆత్మహత్య చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

ఆత్మహత్య..

ఈ క్రమంలోనే జమ్మికుంట మండలంలోని పాపయ్యపల్లి శివారులో గల రైల్వే ట్రాక్ పై ఆదివారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో రైల్వే ట్రాక్ మిదికి వెళ్లారు. గూడ్స్ డ్రైవర్ హారన్ మోగించినప్పటికీ లేవకుండా అలాగే పడుకుని ఉన్నారని సదరు డ్రైవర్ రైల్వే శాఖ అధికారులకు వెల్లడించారని సమాచారం.

కానీ ఇక్కడ అనూహ్యంగా అటు రాహుల్, ఇటు శ్వేత కుటుంబ సభ్యులు మాత్రం వారి ప్రేమ విషయం తెలియదని వాపోతున్నారు. తమ పిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు కూడా తెలియదని అంటున్నారు. ప్రేమ వ్యవహారం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని రాహుల్‌ తండ్రి రాజు ఫిర్యాదు ఇవ్వగా.. ఏ కారణంతో చనిపోయిందో తెలియదని మృతురాలి తండ్రి రాజలింగు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాంతో ఇద్దరి ఆత్మహత్య ఘటన మిస్టరీగా మారింది. ఇద్దరి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+