యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్‌పై ఆగంతకుల దాడి, తీవ్రగాయాలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో కలకలం చోటు చేసుకుంది. హనుమకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
వరంగల్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో కలకలం చోటు చేసుకుంది. హనుమకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. దీంతో పవన్ స్పృహ తప్పి కిందపడిపోయాడు. వెంటనే అతడ్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలించారు.
పవన్ పై ఎవరు దాడి చేశారనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో పవన్ పాల్గొన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడే సమయంలో ఒక భవనంపై నుంచి ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేను విమర్శించేదిగా ఆ ఫ్లెక్సీ ఉండటం గమనార్హం. అయితే, కాంగ్రెస్ సభ ముగిసే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పవన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలిసింది.

పవన్‌పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. తోట పవన్‌పై టీఆర్ఎస్ నేతల దాడి అమానుషమని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి అన్నారు. పవన్‌ను పరామర్శించి పరిస్థితులు తెలుసుకునేందుకు హుటాహుటిన వరంగల్ బయలుదేరారు యూత్ అధ్యక్షులు శివసేనారెడ్డి.
టిఆర్ఎస్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలి..
అంతకుముందు, పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్ నగరంలోని ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆరోపించారు. ఎక్కడ చూసినా భూ కబ్జాలే కనిపిస్తున్నాయన్నారు. కబ్జాల కారణంగా నాలాలు కుచించుకుపోయాయని, చెరువులు కనుమరుగయ్యాయంటూ ధ్వజమెత్తారు. మరో ఏడాదిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వస్తుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికివస్తే ఊరుకోబోమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Ruling party BRS leaders brutally attacked Youth Congress worker, Thota Pawan in Hanmakonda District of Telangana.
— Telangana Youth Congress (@IYCTelangana) February 20, 2023
Rowdyism has become a synonym with KC Rao's rule.
This inhumane, brutal attack on Congress shows how scared BRS are of Congress in Telangana. pic.twitter.com/UdL7KxU8dt
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బొందల గడ్డగా మారింది. వరంగల్ ఏకశిల పార్కు తాగుబోతులకు అడ్డాగా మారింది. కాళోజీ కళాక్షేత్రం మొండి గోడలతో నిలబడ్డది. కేసీఆర్ కట్టిస్తామన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏమయ్యాయి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వలేదు. తొమ్మిదేళ్లు పూర్తైనా అమరుల స్థూపం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కూడా పూర్తి కాలేదు. ఆ దయాకర్ ఏక్ నెంబర్ అయితే ఈ దయాకర్ దస్ నెంబర్' అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.












Click it and Unblock the Notifications