అతనికి పెళ్లయిందని తెలిసి కూడా... ప్రేమించాలని యువతి వేధింపులు... యువకుడి ఆత్మహత్యాయత్నం

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తాను వివాహితుడినని తెలిసి కూడా ఓ యువతి ఆమెను ప్రేమించాలని వేధింపులకు గురిచేస్తుండటంతో అతను ఆత్మహత్యకు యత్నించాడు.ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే... లంబాడిపల్లికి చెందిన వేముల గణేశ్‌‌కు భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. గణేశ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజూ జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఆయా గ్రామాలకు ఆటో నడుపుతుంటాడు. ఈ క్రమంలో జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే యువతితో గణేశ్‌కు పరిచయం ఏర్పడింది.ఇద్దరు స్నేహపూర్వకంగా మాట్లాడుకునేవారు.గణేశ్ ఆటోలోనే ఆమె రోజూ రాకపోకలు సాగించేది.

youth suicide attempt after a girl allegedly harassed him to love her

ఇదే క్రమంలో కొద్దిరోజులుగా ఆమె ప్రేమ పేరుతో గణేశ్‌ను వేధించడం మొదలుపెట్టింది. ఇతరులతో ఫోన్లు చేయించి అతన్ని బెదిరించే ప్రయత్నం చేసింది. దీంతో మనస్తాపానికి గురైన గణేశ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని జగిత్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నాడు.

వివాహేతర సంబంధం... వివాహిత ఆత్మహత్య... :

ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్‌కి చెందిన బోరిగాం పూజిత(30) అనే మహిళ ఆత్మహత్యకు యత్నించింది. తనతో పాటు మూడేళ్ల తన బిడ్డకు పురుగుల మందు తాగించింది. చిన్నారి ప్రాణాలు కోల్పోగా పూజిత ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఇటీవల రాఖీ పండుగ రోజు పూజిత... సారంగపూర్‌కి చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి గ్రామం నుంచి వెళ్లిపోయింది.శ్రీకాంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఆమెను పలు ప్రాంతాలకు తీసుకెళ్లాడు. అనంతరం నిర్మల్ బస్టాండ్‌లో ఆమెను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. పూజిత అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన కరువైంది. అనంతరం బస్టాండ్ పక్కనే ఉన్న ఓ లాడ్జికి వెళ్లింది పూజిత. అక్కడ తాను పురుగుల మందు తాగి,బిడ్డకు కూడా తాగించింది. లాడ్జి సిబ్బంది వీరిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే నిర్మల్ జిల్లా ఆస్పత్రికి ఇద్దరినీ తరలించారు. అయితే అప్పటికే పూజిత బిడ్డ మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

Recommended Video

    ఏడేళ్లుగా జరిగిన అభివృద్దిపై పెదవి విరిచిన మూడుచింతలపల్లె గ్రామస్తులు..!! || Oneindia Telugu

    మరోవైపు పూజిత రెండు రోజులుగా కనిపించట్లేదని ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు.పూజిత ఆత్మహత్యకు యత్నించిందని తెలిసి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మూడేళ్ల చిన్నారి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+