జూలై 8న జగన్..షర్మిల అక్కడే : కొత్త పార్టీ ప్రకటన సమయం ఇదే : కీలక సన్నివేశాలకు వేదికగా..!!

జూలై 8న. వైఎస్సార్ జన్మదినం. ఆయన తనయుడు-ఏపీ సీఎం జగన ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాలు డిసైడ్ చేసారు. ఇటు తెలంగాణలో కుమార్తె షర్మిల పార్టీ ప్రకటనకు అదే రోజు ముహూర్తంగా ఎంచుకున్నారు. ప్రతీ ఏటా వైఎస్సార్ జయంతి..వర్దంతి నాడు వైఎస్ కుటుంబ సభ్యులంగా పులివెందల చేరుకుంటారు. ఇడుపుల పాయలో వైఎస్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళి అర్పిస్తారు. వైఎస్ మరణం సమయం నుండి ప్రతీ ఏటా ఇదే విధంగా జరుగుతోంది. అదే విధంగా క్రిస్మస్ పండుకు అంతా పులివెందులకు రావటం..అక్కడ ప్రార్ధనల్లో పాల్గొంటారు.

Recommended Video

    వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన ఆ రోజే.. కీలక సన్నివేశాలకు వేదిక కానున్న ఇడుపులపాయ!! || Oneindia Telugu
    దూరంగా షర్మిల..

    దూరంగా షర్మిల..

    కానీ, గత ఏడాది క్రిస్మస్ వేడుకలకు షర్మిల పులివెందుల కు దూరంగా ఉన్నారు. తరువాత జరిగిన పరిణామాల్లో భాగంగా.. షర్మిల ఫిబ్రవరి 9న తాను తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో తమ మధ్య అన్నా-చెల్లెళ్లుగా బంధం కొనసాగుతుందని షర్మిల స్పష్టం చేసారు. రాఖీ పండుగ నాడు కలవటం ఉంటుదని వివరించారు. ఇక, రాజకీయ ప్రసంగాల్లో భాగంగా..తెలంగాణ ప్రయోజనాల కోసం అన్నతో అయిన పోరాటానికి సిద్దమంటూ తేల్చి చెప్పారు.

    తెలంగాణ కోసం అన్నతోనూ..

    తెలంగాణ కోసం అన్నతోనూ..

    ఇక, ఇప్పుడు జరుగుతున్న రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంలో భాగంగా..తన అన్న పేరు ఎత్తకుండానే తెలంగాణ ప్రయోజాలకు నష్టం కలిగేలా చుక్క నీరు వదులుకోవటానికి కూడా సిద్దంగా లేం..అందుకోసం ఎవరితోనైనా పోరాటానికి సిద్దమంటూ ట్వీట్ చేసారు. ఇక, ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్సార్ జన్మదినం నాడు సీఎం జగన్..షర్మిల ఇద్దరూ ఇడుపుల పాయకు వెళ్తున్నారు. సీఎం జగన్ ఆ రోజున రైతు దినోత్సవం కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు.

    ఇద్దరు తండ్రి సమాధి వద్ద..

    ఇద్దరు తండ్రి సమాధి వద్ద..

    షర్మిల ఇడుపుల పాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి...ప్రత్యేక ఛాపర్ లో బేగంపేట చేరుకుంటారు. అయితే, వైఎస్సార్ సమాధి వద్ద అన్నా .. చెల్లెల్లు ఒకే సమయంలో వెళ్తారా.. అక్కడ కలుస్తారా..నాటి అప్యాయతలు మరలా కనిపిస్తాయా..ఏం జరగబోతోందనే ఉత్సుకత వైఎస్సార్..జగన్..షర్మిల అభిమానుల్లో కనిపిస్తోంది. అదే విధంగా..అక్కడ నుండి హైదరాబాద్ చేరుకున్న తరువాత షర్మిల నగరంలోని పంజాగుట్ట వద్ద ఉన్న వైఎఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు.

    పార్టీ పేరు...జెండా..అజెండా ప్రకటన..

    పార్టీ పేరు...జెండా..అజెండా ప్రకటన..

    ఆ తరువాత జేఎన్ఆర్ కన్వెన్షన్ లో పార్టీ ప్రకటన కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. తొలుత లోటస్ పాండ్ లోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారనే చర్చ జరిగినా...పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. . పార్టీ ప్రకటన తో పాటుగా తమ విధి విధానాలు...జెండా-అజెండాను షర్మిల ప్రకటించనున్నారు. ఆ కార్యక్రమానికి తల్లి విజయమ్మ సైతం హాజరు కానున్నట్లు సమాచారం. దీంతో.. ఇడుపుల పాయలో ఏం జరగబోతోంది...షర్మిల తన పార్టీ ప్రకటన సమయంలో ఏం చెప్పబోతున్నారు...ఏపీ ప్రభుత్వం పైన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+