పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ పనుల్లో ఐదుగురి చావుల బాధ్యత ఎవరిది? వైఎస్ షర్మిల సూటిప్రశ్న
తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన నాటి నుండి తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు వైయస్ షర్మిల. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు, ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగిస్తూ, కష్టాల్లో ఉన్న వారికి బాసటగా అనేక పర్యటనలు చేస్తూ దూకుడును చూపిస్తున్నారు వైయస్ షర్మిల. తాజాగా తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదల విషయంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ని టార్గెట్ చేస్తున్న షర్మిల నిత్యం కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని, బాధితులను ఆదుకోలేదని నిప్పులు చెరుగుతున్నారు.

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పనుల్లో ప్రమాదంపై స్పందించిన వైఎస్ షర్మిల
కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో దారుణ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అంటూ మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార టిఆర్ఎస్ పార్టీపై తనదైన శైలిలో వైఎస్ షర్మిల నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్లో క్రేన్ వైరు తెగి పడి ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిన ఘటనపై వైయస్ షర్మిల స్పందించారు.

సేఫ్టీ పాటించకుండా ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది మేఘా కంపెనీ.. మండిపడ్డ షర్మిల
పాలమూరు-రంగారెడ్డి మొదటి స్టేజ్ నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో బీహార్ కు చెందిన ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో కార్మికుడు తీవ్ర గాయాల పాలు కాగా అతనిని ఆసుపత్రికి తరలించారు. పంప్ హౌస్ లోకి వెళుతున్న క్రమంలో క్రేన్ వైరు తెగి పడడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. అయితే దీని పై మండిపడిన వైయస్ షర్మిల సేఫ్టీ పాటించకుండా ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది మేఘా కంపెనీ అంటూ నిప్పులు చెరిగారు

ఈ చావుల బాధ్యత ఎవరిది? ఈప్రాణాల ఖరీదు ఎంత?
ఇదే సమయంలో ఈ చావుల బాధ్యత ఎవరిది? ఈప్రాణాల ఖరీదు ఎంత? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైయస్ షర్మిల. ఇలాంటి ఎన్ని చావులను నోట్ల కట్టల కింద దాచిపెట్టారు? బయటకు రాని లోకానికి తెల్వని వార్తలెన్ని? అంటూ వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. దొరగారు అణిచిపెడుతున్న అక్రమాల ఆర్తనాదాలు ఎన్ని? చెప్పాలని వైయస్ షర్మిల ప్రశ్నించారు.

మేఘా సంస్థ కాంట్రాక్టులు రద్దు చెయ్యాలి .. సీబీఐతో ఎంక్వైరీ చేయించాలి
ఇదే సమయంలో సదరు సంస్థ కాంట్రాక్టులను రద్దు చేయాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు. మేఘా సంస్థ పై సిబిఐతో ఎంక్వయిరీ చేయించాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు. ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమై, జనం సొమ్ము దోచుకుంటున్న సంస్థకు బుద్ధి చెప్పాలన్నారు. రక్షణ చర్యలు పాటించకుండా, నాసిరకం పనులు చేస్తూ, అడిగేవాడు ఉండకూడదని అడ్డగోలుగా లంచాలు ఎర వేస్తూ ప్రజల ప్రాణాలతో మేఘ కంపెనీ చెలగాటమాడుతోందని మండిపడ్డారు. తక్షణం కంపెనీ కాంట్రాక్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు వైయస్ షర్మిల.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications