Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు- కేసీఆర్ బంధం : అసెంబ్లీకి పోటీ - పాదయాత్రపై షర్మిల కీలక ప్రకటన..!!

వైఎస్పార్టీపీ చీఫ్ షర్మిల తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. తాజాగా షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తిరిగి పాదయాత్ర ప్రారంభం పైన షర్మిల స్పష్టత ఇచ్చారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ - చంద్రబాబకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. కోర్టు ఆదేశాలిచ్చినా..తనకు అడ్డుకొనే ప్రయత్నం చేస్తన్న పోలీసులపైన కేసు పెడతానని స్పష్టం చేసారు. తెలంగాణను దోచుకున్న కేసీఆర్..ఇప్పుడు దేశాన్ని దోచుకొనేందుకు సిద్దమయ్యారంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపైన క్లారిటీ ఇచ్చారు.

సంక్రాంతి తరువాత పాదయాత్ర..

సంక్రాంతి తరువాత పాదయాత్ర..

పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వటంతో తిరిగి యాత్ర ప్రారంభించేందుకు షర్మిల సిద్దమయ్యారు. సంక్రాంతి తరువాత పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని షర్మిల ప్రకటించారు. వైద్యులు రెండు వారాలు సెలవు తీసుకోవాలని సూచించారని షర్మిల వెల్లడించారు. తన పాదయాత్రను అడ్డుకోవటానికి కేసీఆర్ అడుగడుగునా ప్రయత్నించారని ఆరోపించారు. పాదయాత్ర చేసుకోవచ్చని హైకోర్టు మరోసారి కేసీఆర్ సర్కార్ కి మొట్టికాయ వేసిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అడుగడుగునా పోలీసులను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా కేసీఆర్ అధీనంలోకి వెళ్ళిందని ఆరోపించారు. పోలీసుల భుజాన గన్ను పెట్టి కేసీఆర్ తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. తనను కట్టడి చేసే పోలీసులపై కేసు పెడుతానని షర్మిల స్పష్టం చేసారు.

ఆరోగ్య సమస్యలు - వైద్యులు సూచించారు

ఆరోగ్య సమస్యలు - వైద్యులు సూచించారు

తెలంగాణని దోచుకున్నది అయిపోయింది. ఇక దేశాన్ని దోచుకోవడానికి కేసీఆర్ సిద్ధమయ్యారంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసారు. న్యాయవ్యవస్థ బ్రతికి ఉన్నందుకు సంతోషమని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అపాలజీ చెప్పే మనసు లేదన్నారు. కోర్టు తీర్పును గౌరవించి పాదయాత్ర చేసుకొనే అవకాశం ఇశ్వాలన్నారు. తాను దీక్ష సమయంలో గంటల పాటు మంచి నీళ్లు తాగకేండా, రోడ్డుపై కూర్చోవటం వలన వెన్నుముక సమస్య వచ్చిందన్నారు. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని వెల్లడించారు. కేసీఆర్ కిసాన్ ద్రోహిగా అభివర్ణించిన షర్మిల... ఆయన కిసాన్ సర్కార్ అనడం ఎంటని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక టోపీ పెట్టుకొని పిట్టలదొర లాగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. సమస్యలతో తెలంగాణ రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కేసీఆర్ ఇతర రాష్ట్రాల రైతులకు చెక్కులు ఇస్తున్నారన్నారు. కేసీఆర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని ఎద్దేవా చేసారు. కవిత బతుకమ్మ ఆడుతూనే బతుకమ్మ పూలు తెలంగాణ ప్రజల చెవిలో పెడుతున్నారని విమర్శించారు.

పాలేరు పైన ఇక ఫోకస్

పాలేరు పైన ఇక ఫోకస్

ఇప్పటికే షర్మిల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీని కోసం పాలేరులో భూమి పూజ చేయనున్నట్లు ప్రకటించారు. కేసీఅర్ కూతురు కాకుంటే కవిత పరిస్థితి ఎలా ఉండేదని షర్మిల ప్రశ్నించారు. ఎంపీగా ఓడిపోయి ఎమ్మెల్సీ తీసుకున్న కవిత ఆత్మ గౌరవం గూర్చి మాట్లాడడం ఎంటని నిలదీసారు. స్కూటర్ పై తిరిగే కేసీఅర్ కి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వైఎస్సార్ ఉన్నప్పుడు తాను ఒక్క పదవి కూడా తీసుకోలేదని గుర్తు చేసారు. తనను ఏ ఉచ్చులో బందిస్తున్నారో... కవిత అదే ఉచ్చులో చిక్కుకుంటారని చెప్పుకొచ్చారు. కేసీఅర్ రాజకీయ ప్రవేశం చేసింది తెలంగాణ కోసం కాదన్నారు. కేసీఅర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబును దేవుడు అని పొగిడారని గుర్తు చేసారు. పదవి పోయేసరికి పార్టీ నుండి బయటకొచ్చారని చెప్పుకొచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+