• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆర్టీసీ నష్టాల డ్రామా ఎందుకు? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? కేసీఆర్ కు షర్మిల చురకలు

|
Google Oneindia TeluguNews

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నిత్యం తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఏదో ఒక విషయంలో టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ పార్టీని స్థాపించి తెలంగాణా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తామని చెప్పిన షర్మిల ప్రజా క్షేత్రంలో దూసుకుపోయే విధంగా పాదయాత్రలు, దీక్షలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ప్రజల కష్టాలను తెలుసుకుని తెలంగాణా సర్కార్ పై ఒత్తిడి పెంచుతున్నారు.

ఏపీసీఎం వైఎస్ జగన్ కు, తెలంగాణా సీఎం కేసీఆర్ కు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ.. విషయమిదే!!ఏపీసీఎం వైఎస్ జగన్ కు, తెలంగాణా సీఎం కేసీఆర్ కు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ.. విషయమిదే!!

రైతుల సమస్యలపై కేసీఆర్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల

రైతుల సమస్యలపై కేసీఆర్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల

ఏ విషయం అయినా సూటిగా ప్రశ్నించే షర్మిల కేసీఆర్ కు కంట్లో నలుసులా తయారయ్యారు. ఏ సమస్యపైన అయినా కేసీఆర్ ను నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల రైతుల సమస్యలపై రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేసిన షర్మిల, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్ల కోసం కోట్లైనా ఖర్చు చేస్తారు.. ఒడ్లు కొనడానికి మాత్రం మీకు మనసొప్పదా ? మీది గుండెనా బండనా అంటూ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన షర్మిల రైతులకు కనీస భరోసా కల్పించలేని ఆ ముఖ్యమంత్రి పదవి మీకెందుకు అంటూ గట్టిగా నిలదీశారు.

బస్సు చార్జీల పెంపుపై కేసీఆర్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల

బస్సు చార్జీల పెంపుపై కేసీఆర్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల

ఇక తాజాగా ఆర్టీసీ ఛార్జీల పెంపుపై తెలంగాణ సర్కారు తీరును విమర్శిస్తూ మరోమారు సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు షర్మిల. బస్సు చార్జీలు పెరుగుతున్నాయని, మరో మూడు నాలుగు రోజుల్లో అమల్లోకి వస్తాయని ఆర్టీసీని గాడిని పెట్టడం కోసం, మినిమమ్ ఛార్జ్ లన్నింటినీ పెంపు చేస్తున్నామని, చిల్లర సమస్య ఉండడంతో రౌండ్ ఫిగర్ రేటు ఫిక్స్ చేసి, చిల్లర సమస్య పరిష్కరిస్తామని,కేంద్రం డీజిల్ రేట్లు పెంచడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించిన అంశాన్ని, బస్సు ఛార్జీల పెరుగుదల పై పేపర్ క్లిప్పింగ్స్ ను పోస్ట్ చేసిన షర్మిల సీఎం కేసీఆర్ దొర అంటూ మరోమారు తెలంగాణ సీఎం ను టార్గెట్ చేశారు.

 చదవేస్తే ఉన్న మతి పోయినట్టుంది.. అందుకే దొరగారి తీరు ఇలా

చదవేస్తే ఉన్న మతి పోయినట్టుంది.. అందుకే దొరగారి తీరు ఇలా

చదవేస్తే ఉన్న మతిపోయినట్టు, ఉమ్మడి రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీని అభివృద్ధి పథంలో తీసుకుపోయినానని చెప్పుకునే దొర గారికి.. సీఎం పదవిలో ఉన్నా ఆర్టీసీని నష్టాల బారినుంచి గట్టెక్కించడం మాత్రం చేతకావడం లేదు అంటూ వైయస్ షర్మిల మండిపడ్డారు. ఇప్పుడు ఆర్టీసీని గాడిన పెట్టేందుకంటూ ఛార్జీల పెంపునకు తయారయ్యారు దొరగారు అంటూ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఎద్దేవా చేశారు . ఇప్పటికే రెండు సార్లు ఛార్జీలు పెంచిన దొర, మూడో సారి పెంచేందుకు రెడీ అయ్యారని వైయస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .

 ఈ నష్టాల డ్రామా ఎందుకు ? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా?

ఈ నష్టాల డ్రామా ఎందుకు ? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా?

అయ్యా దొరగారు, ఎందుకు ఈ నష్టాల డ్రామా? రాజు తలుచుకొంటే దెబ్బలకు కొదవా? మీరు తలుచుకొంటే ఆర్టీసీ నష్టాలను పూడ్చడం కష్టమా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణ ఆర్టీసీని మీ అనుచరులకు అప్పగించేందుకు ఈ డ్రామా ఆడుతున్నామని చెప్పొచ్చు కదా సారు అంటూ వైయస్ షర్మిల కెసిఆర్ పై విరుచుకుపడ్డారు.ఆర్టీసీ చార్జీల పెంపు అంశాన్ని తీసుకుని వైఎస్ షర్మిల కేసీఆర్ కు చురకలు అంటించారు .

English summary
YS Sharmila has targeted Telangana CM KCR over the increase in RTC charges. In the name of groaning the RTC,KCR was incensed as to whether there was a need for a drama of hike in charges. Sharmila blamed KCR for the RTC losses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X