జగన్ పార్టీ ఎమ్మెల్యే రాజీనామా: ఫ్యాక్స్ ద్వారా స్పీకర్‌కు లేఖ
కడప: కడప జిల్లా మైదుకూరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడదు రఘురామిరెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా ఆయన స్పీకర్ కోడెల శివ ప్రసాద్‌కి పంపించారు. తక్షణం ఆమోదించాలని కోరారు.
రంజాన్ తోఫా పంపిణీ సందర్భంగా శుక్రవారంనాడు అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానించారని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనను కాదని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్‌ను ముందు వేదికపైకి పిలవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు.

ఇది మొదటి సారి కాదని జిల్లా అధికారులు గతంలో అనేక సార్లు ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానించారని లేఖలో తెలిపారు. ఇదే అంశాన్ని ఆయన ఇంతకుముందు పలుమార్లు స్పీకర్ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. కొరియర్ ద్వారా కూడా తన రాజీనామా లేఖను ఆయన స్పీకర్‌కు పంపించారు.
తనకన్నా ముందు తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ పుట్టా సుధాకర్‌ను వేదిక మీదికి ఆహ్వానంచడాన్ని అవమానంగా భావించి ఆయన అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు.












Click it and Unblock the Notifications