ఏపీకి ' ప్రత్యేక హోదా' కోసం కరీంనగర్‌లో వైసీపీ ధర్నా..
రహదారులపై ధర్నాలకు దిగిన నేతలు హోదాకు మద్దతు తెలుపుతూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు.
కరీంనగర్: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత జగన్ ఉద్యమిస్తుండటంతో.. అదే స్ఫూర్తితో ఇటు తెలంగాణ రాష్ట్రంలోను ఆ పార్టీ కార్యకర్తలు హోదాపై నినదిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ నేతలు నిరసనకు దిగారు.
రహదారులపై ధర్నాలకు దిగిన నేతలు హోదాకు మద్దతు తెలుపుతూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ చౌక్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హోదా ఇవ్వాల్సిందేనని నినాదాలు చేశారు.

ఈ సందర్బంగా వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. హోదాపై నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతీ ఒక్కరికి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రజా ఆందోళనలను అణిచివేయాలన్న ఆలోచనలను మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు.












Click it and Unblock the Notifications