హైద్రాబాద్ లో రూ.5 భోజనం చేసిన వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, కారణమిదే
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిష్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బుధవారం నాడు జిహెచ్ ఎం సీ ఆధ్వర్యంలోని హరేకృష్ణ ధార్మిక సంస్థ నిర్వహించే భోజన కేంద్రంలో భోజనం చేశారు.
మండే ఎండలో ఇతరుల మాదిరిగానే ఆయన కూడ క్యా లైన్లో నిలబడి మరీ భోజనం చేశారు.అనంతరం అక్కడ ఉన్న సదుపాయాలను ఆయన అడిగి తెలుసుకొన్నారు.

తెలంగాణలో ఐదు రూపాయాలకు ఏర్పాటు చేసిన భోజన పథకం బాగుందన్నారాయన. తన నియోజకవర్గంలో కూడ ఈ రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నానని చెప్పారు.
స్వంత ఖర్చుతో పేదలకు భోజనం పెట్టాలని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో రూ.భోజనం పథకాన్ని స్వయంగా పరిశీలించేందుకు వచ్చినట్టు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications