కొత్త బాధ్యతల్లో వైఎస్ షర్మిల - ప్రతిపక్షాలకు లేఖ..!!

తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కొత్త బాధ్యతలు తీసుకున్నారు.

తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కొత్త బాధ్యతలు తీసుకున్నారు. ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేద్దామంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ - బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలకు..నేతలకు లేఖలు రాసారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోసం అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుద్దామని ప్రతిపాదించారు. పాలనలోని వైఫల్యాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంతకంతకూ దిగజార్చుతోందని విమర్శించారు. విపక్షాలు ఒక్కటై ముందుకు అడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంతకంతకూ దిగజార్చుతోందని వైఎస్ షర్మిల విమర్శించారు. పాలనలో అవినీతికి వ్యతిరేకంగా ఐక్యంగా గళమెత్తాలని షర్మిల పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు, ఆందోళనలకు కూడా అనుమతులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు వద్దకు వెళ్లేందుకు వీల్లేకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలు చేసే వారిపై అధికారమదంతో దాడులు చేస్తున్నారన్నారని ఫైర్ అయ్యారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని ఆ లేఖలో పేర్కొన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కోదండరాం, కాసాని జ్జానేశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అసదుద్దిన్ ఓవైసి, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంభశివరావు, ఎన్ శంకర్ గౌడ్, మందక్రిష్ణ మాదిగలకు షర్మిల లేఖలు రాశారు.

YSRTP Chief YS Sharmila letters to the opposition parties, asking all parties to unite against the

ఒక మహిళగా గడిచిన రెండేళ్లుగా తనను అంటున్న మాటల గురించి ప్రస్తావించారు. హేళన చేస్తున్నా.. హెచ్చరికలను లెక్క చేయకుండా ప్రజలకోసం ముందుకు సాగిపోతున్నానని షర్మిల వివరించారు.
తనను అడ్డుకునేందుకు యత్నించారన్నారని ఆరోపించారు. ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తనను కారులో ఉండగానే టోయింగ్ చేసిన దారుణం ఆంధ్రాపాలకుల హయాంలోనూ చోటు చేసుకోలేదంటూ షర్మిల వ్యాఖ్యానించారు.

YSRTP Chief YS Sharmila letters to the opposition parties, asking all parties to unite against the

అవినీతిపై గళం విప్పినా కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారని ఆరోపించారు. అమరవీరుల త్యాగాల్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల మీద ఉందని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందరం కలిసి రాష్ట్రపతిని కలసి, రాష్ట్రంలో నెలకొన్న అరాచకపాలన గురించి విన్నవించాలని ప్రతిపక్షాలకు రాసిన లేఖలో షర్మిల పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+