తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జగన్.. ఓ బ్రహ్మపదార్థం: దగ్గరి నుంచి చూస్తే మాత్రం: పోసాని కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

తిరుపతి: ప్రముఖ నటుడు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోసాని కృష్ణమురళి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారు జామున ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ఆయన సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఈ తెల్లవారు జామున శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఎవరేం మాట్లాడినా..

ఎవరేం మాట్లాడినా..

అనంతరం ఆలయం వెలుపల తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు రోజూ ప్రయత్నిస్తూనే ఉంటాయని, అది సాధ్యం కాదని చెప్పారు. వైఎస్ జగన్, ఆయన వ్యక్తిత్వం గురించి ప్రతిపక్ష పార్టీల నాయకులు, తనలాంటి వారు కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారని పోసాని పేర్కొన్నారు. ఎవరు ఏం మాట్లాడినా జగన్ గురించి తాను ఒకే ఒక్క ముక్కలో తేల్చేస్తానని, మరో మాటకు ఛాన్స్ లేదని చెప్పారు.

సినిమా టికెట్ల పెంపుదలపై..

సినిమా టికెట్ల పెంపుదలపై..

సినిమా టికెట్ల అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పోసాని మాట్లాడారు. సినిమా టికెట్ల పెంపుదల విషయంలో ప్రతిపక్షాలు గానీ, బయటి వ్యక్తులు గానీ వైఎస్ జగన్‌ను ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు అన్నారని గుర్తు చేశారు. చివరికి ఏమైందో అందరికీ తెలుసు కదా అని చెప్పారు. సామాన్య ప్రేక్షకులపై భారం పడకుండా, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నష్టం కలగకుండా సినిమా టికెట్ల రేట్ల వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు. సినిమా టికెట్ల రేట్లను సవరిస్తూ జారీ చేసిన జీవో వల్ల ఏ ఒక్కరికీ నష్టం ఉండదని వ్యాఖ్యానించారు.

బ్రహ్మపదార్థంలా కనిపిస్తారు..

బ్రహ్మపదార్థంలా కనిపిస్తారు..

దూరం నుంచి చూసిన వారికి వైఎస్ జగన్ ఓ బ్రహ్మపదార్థంలా కనిపిస్తారని పోసాని కృష్ణమురళి అన్నారు. బ్రహ్మపదార్థం అంటే అర్థం తెలుసుకదా అని ప్రశ్నించారు. దగ్గరి నుంచి చూస్తే మాత్రం దేవుడి ప్రసాదంలా కనిపిస్తారని చెప్పారు. ఆయన గురించి తన అభిప్రాయం ఇదేనని స్పష్టం చేశారు. ఆయన గురించి తాను ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని అన్నారు. ఎప్పుడు, ఎవరు అడిగినా ఆయన గురించి తాను ఇదే చెబుతానని పేర్కొన్నారు.

 హీరోగా రెండు సినిమాలు..

హీరోగా రెండు సినిమాలు..

అనంతరం ఆయన తన కేరీర్ గురించి మాట్లాడారు. తాను హీరోగా ఓ సినిమా చేశానని, వచ్చేనెలా ఆ మూవీ విడుదల కాబోతోందని పోసాని అన్నారు. హీరోగా మరో సినిమా కూడా సెట్స్‌పై ఉందని చెప్పారు. అవేకాకుండా- మహేష్ బాబు సర్కారువారి పాట వంటి అయిదారు సినిమాల్లో నటించానని, అవన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. సినిమా, రాజకీయలను బ్యాలెన్స్ చేసుకుంటున్నానని, ఎప్పుడు ఏ పని ఉంటే అప్పుడా పని చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పారు.

ఏర్పాట్లు బాగున్నాయంటూ..

ఏర్పాట్లు బాగున్నాయంటూ..


తిరుమలలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని పోసాని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. కాగా, సోమవారం 70,408 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 34,932 స్వామివారికి తమ తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయం 4.63 కోట్ల రూపాయలుగా టీటీడీ అధికారులు నిర్ధారించారు.

English summary
Actor turned politician Posani Krishna Murali visits Tirumala and offered prayers to Lord Venkateswara. He praised Chief Minister YS Jagan Mohan Reddy and his administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X