తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అభినయ వర్సెస్ సునీల్: తిరుపతి ఎయిర్ పోర్టు, క్వార్టర్స్‌కు నిలిచిన నీరు..

|
Google Oneindia TeluguNews

తిరుపతి ఎయిర్ పోర్టు, సిబ్బంది నివాస గృహాలకు ఇటీవల నీటి సరఫరా నిలిచిపోయింది. ఎందుకు అని తెలిస్తే.. షాక్ అవుతారు. అవును అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడు.. తిరుపతి డిప్యూటీ మేయర్ నీటిని నిలిపివేసి తన కక్షను తీర్చుకున్నాడు. ఈ మేరకు ఇండియా టుడే వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. అసలు ఏం జరిగిందంటే..?

బొత్స రాగా..

బొత్స రాగా..

ఇటీవల తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరిగాయి. ముగింపు వేడుకలు ముఖ్య అతిథిగా మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చారు. ఆయనతోపాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. అయితే వారికి స్వాగతం పలికేందుకు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి వెళ్లారు. అక్కడ అతనని ఎయిర్ పోర్టు సిబ్బంది ఆపేశారు. ఇంకేముంది అభినయకు ఎక్కడో కాలింది.. తననే అడ్డుకుంటారా అంటూ ఎయిర్ పోర్టు, సిబ్బంది నివాస గృహాలకు తన సత్తా ఏంటో చూపించారు.

అభినయను ఆపిన సునీల్

అభినయను ఆపిన సునీల్

అభినయ రెడ్డిని తిరుపతి ఎయిర్ పోర్టు మేనేజర్ సునీల్ అడ్డుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆయన నీటి సరఫరాను నిలిపివేయించారు. వాస్తవానికి నీటి సరఫరా ఊరికే ఆగిపోదు. చెబితేనే.. కావాలని నిలిపివేస్తే మాత్రం రావు. ఇందులో అభినయ పాత్ర ఉందని తెలుస్తోంది. కానీ తిరుపతి మున్సిపల్ సిబ్బంది మాత్రం పై‌పులైన్‌లో సమస్య ఏర్పడిందని చెప్పి.. తప్పించుకునే ప్రయత్నం చేశారు.

Recommended Video

Telangana BJP Meets Governor On GO 317 | Oneindia Telugu
నిలిచిన నీటి సరఫరా

నిలిచిన నీటి సరఫరా

ఎయిర్ పోర్టు కాదు.. నివాస గృహాలకు కూడా నీటి సరఫరా లేదు. అంతేకాదు డ్రైనేజీ సమస్య కూడా ఏర్పడగా.. తెలుగు గంగ నీటిని డ్రైనేజీ కలుషితం చేస్తుందని చెప్పారు. అయితే అంతకుముందు ఎయిర్ పోర్టు వద్ద వైసీపీ నేతల ప్రవర్తన సరిగా లేదని సమాచారం.

దీనిపై తిరుపతి మున్సిపల్, రేణిగుంట విమానాశ్రయ సిబ్బందిని వివరణ కోరగా.. స్పందించేందుకు నిరాకరించారు. అయితే ప్రతిపక్ష టీడీపీ మాత్రం మండిపడింది. ఎయిర్ పోర్టు, క్వార్టర్లకు నీరు నిలిపివేయడం ఏంటీ అని నారా లోకేశ్ అడిగారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇదీ వైసీపీ ప్రభుత్వ అనాగరిక చర్యగా అభివర్ణించారు. దీనిని తమ పార్టీ ఖండిస్తుందని తెలియజేశారు.

English summary
Tirupati airport and staff residential quarters faced disruption in water supply. This happened after a dispute between Renigunta airport manager Sunil and Tirupati deputy mayor Abhinaya Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X