తిరుపతిలో చిరుతల సంచారం- ఎస్వీ యూనివర్శిటీ క్యాంపస్‌లో..!!
తిరుపతి: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు వెలిసిన తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతలు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరిగింది. 48 గంటల వ్యవధిలో శేషాచలం అడవుల్లో అయిదు వేర్వేరు ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి. వాటిని టీటీడీ అటవీ శాఖ అధికారులు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఎలుగుబంట్లు, ఇతర వణ్యప్రాణుల సంచారం కూడా రెట్టింపైందనే నిర్ధారణకు వచ్చారు.
అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలతో పాటు మొత్తం అయిదు చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు. వాటి కదలికలను పసిగట్టడానికి అలిపిరి మార్గంలో గాలి గోపురం నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు సుమారు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తోన్న నెల్లూరుకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపిన ఉదంతం అనంతరం టీటీడీ అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. చిరుతల సంచారంపై దృష్టి సారించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా వాటి కదలికపై నిఘా ఉంచారు.
లక్షితపై దాడి చేసిన చిరుతను బంధించారు. అది సంచరించే ప్రదేశంలో ఏర్పాటు చేసిన బోనులో చిక్కిందా చిరుత. అనంతరం దీన్నీ ఎస్వీ జూపార్కునకు తరలించారు. చిరుతల సంచారం తీవ్రతరమైన నేపథ్యంలో- టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. హైఅలర్ట్‌ను ప్రకటించారు.
లక్షితను బలి తీసుకున్న చిరుత బోనులో చిక్కిన కొన్ని గంటలకే మరో చిరుత హల్‌చల్ చేసింది.
అలిపిరి మెట్ల మార్గం మీదుగా కాలి నడకన తిరుమలకు బయలుదేరి వెళ్లిన భక్తులకు ఇది కనిపించింది. దీనితో ఒక్కసారిగా వారు భయాందోళనలకు గురి అయ్యారు. గట్టిగా కేకలు వేయడంతో ఆ చిరుత సమీప అటవీప్రాంతంలోకి వెళ్లిపోయింది. కాలినడకన వెళ్లే భక్తులకు తక్షణ రక్షణ చర్యగా ఊతకర్రలను అందించాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తిరుపతిలో చిరుతల సంచారం అధికమైంది. తిరుమల గిరులను ఆనుకుని ఉన్న ప్రఖ్యాత శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ క్యాంపస్‌లో ఓ చిరుత స్వేచ్ఛగా తిరుగాడుతూ కనిపించింది. హాస్టళ్లల్లో నివసించే కొందరు విద్యార్థులు ఈ చిరుతను తమ మొబైల్ ఫోన్లల్లో క్లిక్ మనిపించారు. ఈ విషయాన్ని వర్శిటీ అధికారులకు తెలియజేశారు.
వేలమంది విద్యార్థులు క్యాంపస్‌లో ఉంటోన్నారు. అలాంటి చోట చిరుత ప్రవేశించడం ఆందోళనకు గురి చేస్తోంది. దీన్ని బంధించడానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. చిరుత తిరుగాడే ప్రాంతాల్లో బోను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications