తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు: కుంగిన రోడ్డు: మూడు చోట్ల ధ్వంసం

|
Google Oneindia TeluguNews

తిరుపతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు రాష్ట్రాన్ని అతలకుతలం చేశాయి. వరదలతో ముంచెత్తాయి. కనీవినీ ఎరుగని విధంగా రాయలసీమలో రోజుల తరబడి భారీ వర్షాలు కురిశాయి. వరదముంపునకు గురి చేశాయి. రాయలసీమలో ప్రవహించే పెన్నా, చిత్రావతి, పాపాఘ్ని, కుందు, చెయ్యేరు.. ఇలా అన్ని నదులూ ఉప్పొంగాయి. తీర ప్రాంతాలను ముంచివేశాయి. ఏపీ దక్షిణ తీర ప్రాంతంలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థిితులు ఏర్పడ్డాయి.

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలతో పాటు టెంపుల్ సిటీ తిరుపతి తేరుకోలేకపోతోంది. లోతట్టు ప్రాంతాలు ముంపులోనే కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయ, పునరావాస చర్యలకూ ఆటంకం కలుగుతోంది. దశాబ్దాల తరువాత రాయలచెరువు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంది. పూర్తిగా నిండిపోయింది. తెగే ప్రమాదాన్ని ఎదుర్కొంది. స్థానిక అధికారులు యుద్ధ ప్రాతిపదకన రాయల చెరువు కట్ట లీకులను అరికట్టగలిగారు.

Landslides brought traffic to a halt on the ghat road on Tirumala, TTD officials takes repair work

తిరుమలలోని అన్ని నీటి ప్రాజెక్టులు నిండిపోయాయి. పాపనాశనం, ఆకాశగంగ, మాల్వాడిగుండం.. అన్నీ తొణికిసలాడుతున్నాయి. ఇప్పటికీ వర్షాల తీవ్రత కొనసాగుతూనే ఉంది. తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేటల్లో అడపా దడపా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు ఇంకో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటం వల్ల అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు.

Recommended Video

Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu

ఈ భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ తెల్లవారు జామున ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగి పడటం వల్ల రోడ్డు సైతం కుంగిపోయింది. పెద్ద బండరాళ్లు రోడ్డు మీద పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటన తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజినీరింగ్, అటవీ, విజిలెన్స్ విభాగాలకు చెందిన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. దీనితో వాహనాలు పెద్ద సంఖ్యలో స్తంభించిపోయాయి. దీనితో ఒకే ఘాట్ రోడ్డు మీదుగా వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు.

English summary
Landslides brought traffic to a halt on the ghat road on hill shrine Tirumala. After getting the information TTD officials rush to the spot and takes repair work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X