తిరుమలకు త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు: ఆ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించిన ఆర్టీసీ

తిరుపతి: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పుణ్యక్షేత్రం తిరుమలకు ఇక విద్యుత్ బస్సులు పరుగులు తీయనున్నాయి. వాయు కాలుష్యాన్ని నివారించడానికి ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనికోసం వంద ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనుంది ఏపీఎస్ఆర్టీసీ. ఈ బస్సులను తయారు చేసే కాంట్రాక్ట్‌ను హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా పని చేస్తోన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీకి అప్పగించింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు అనుబంధ కంపెనీ ఇది.

రూ.140 కోట్లతో

రూ.140 కోట్లతో

దశలవారీగా సంవత్సరం కాలంలో ఈ వంద బస్సులను కూడా ఒలెక్ట్రా గ్రీన్‌విచ్ కంపెనీ ఏపీఎస్ఆర్టీసీకి అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు లెటర్ ఆఫ్ అవార్డ్‌ను ఈ కంపెనీకి అందజేశారు. ఈ కాంట్రాక్ట్ విలువ 140 కోట్ల రూపాయలు. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్-2) పథకం కింద ఏపీఎస్ఆర్టీసీ ఈ కాంట్రాక్ట్‌ను ఒలెక్ట్రా గ్రీన్‌విచ్‌కు అప్పగించింది. కొత్తగా అప్పగించిన ఈ కాంట్రాక్ట్‌తో ఏపీఎస్ఆర్టీసీ ఆధీనంలోకి రానున్న ఎలక్ట్రిక్ ఆధారిత బస్సుల సంఖ్య 1,450కి చేరుతుంది.

అలిపిరి డిపోనకు..

అలిపిరి డిపోనకు..

ఈ కాంట్రాక్ట్ ప్రకారం.. 12 నెలల పాటు ఈ బస్సుల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను ఒలెక్ట్రా కంపెనీ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త బస్సులన్నింటినీ తిరుపతిలోని అలిపిరి డిపోనకు అప్పగించే అవకాశం ఉంది. కాగా- ఏపీఎస్ఆర్టీసీ నుంచి తమకు లెటర్ ఆఫ్ అవార్డ్ అందిన విషయాన్ని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ ధృవీకరించారు. ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆధారిత బస్సులను కొనుగోలు చేయనుందని పేర్కొన్నారు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే..

ఒక్కసారి ఛార్జ్ చేస్తే..

ఇప్పటికే తాము హైదరాబాద్, ముంబై, పుణె, నాగ్‌పూర్, సూరత్, డెహ్రాడున్, సిల్వాస, గోవా, హిమాచల్ ప్రదేశ్, కేరళల్లో ఈ విద్యుత్ ఆధారిత బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇప్పుడు కొత్తగా ఏపీఎస్ఆర్టీసీకి వాటిని సరఫరా చేయనున్నామని చెప్పారు. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు పొడవు తొమ్మిది మీటర్ల ఉంటుంది. సీట్ల సామర్థ్యం 35. లిథియం-ఇయాన్ బ్యాటరీ ఆధారంగా ఇవి నడుస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే- 180 కిలోమీటర్ల వరకు రాకపోకలు సాగించ గలుగుతాయి. ఇది ట్రాఫిక్, రోడ్ కండీషన్ మీద ఆధారపడి ఉంటుంది.

లిథియం-ఇయాన్ బ్యాటరీ..

లిథియం-ఇయాన్ బ్యాటరీ..

ఇందులో అమర్చే లిథియం-ఇయాన్ బ్యాటరీ పూర్తిస్థాయిలో ఛార్జ్ కావడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయాన్ని తీసుకుంటుంది. అడ్వాన్స్డ్ బ్రేక్ సిస్టమ్‌ను కలిగి ఉంటుందీ బస్సు. ఎయిర్ కండీషన్డ్ బస్సులు ఇవి. ఇప్పటిదాకా- దేశీయ రోడ్లపై నాలుగు కోట్ల కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించే విద్యుత్ బస్సులను తాము ఆయా రాష్ట్రాలకు సరఫరా చేశామని ప్రదీప్ పేర్కొన్నారు. ఘాట్ రోడ్లపై రాకపోకలు సాగించడానికి వీలుగా ఈ బస్సులను తయారు చేయాల్సి ఉందని ఏపీఎస్ఆర్టీసీ కోరినట్లు చెప్పారు.

అద్దె ప్రాతిపదికన..

అద్దె ప్రాతిపదికన..

విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతిల్లో మొత్తం 350 విద్యుత్ బస్సులను న‌డ‌పాల‌ని ఇదివరకే ఏపీఎస్ఆర్టీసీ నిర్ణ‌యం తీసుకున్న విషయం తెలిసిందే. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన బ‌స్సుల‌ను నడిపించడానికి ఆర్టీసీ అధికారులు టెండర్లను పిలిచారు. ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్, అశోక్ లేలాండ్ బిడ్డింగ్స్ దాఖలు చేశాయి. ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. తిరుపతిలో కొన్ని బస్సులను నడిపించడానికి ముందుకొచ్చింది. అవన్నీ కాంట్రాక్ట్ బేస్డ్. సొంతంగా బస్సులను సమకూర్చుకోవడానికి కొత్తగా ఈ కాంట్రాక్ట్‌ను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు అప్పగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+