తిరుమలలో వైభవంగా అధికమాసం శ్రావణ పౌర్ణమి, పాపాలు తొలగిపోవాలని భక్తులు !

తిరుమల/తిరుపతి: శ్రావణమాసంలో కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శ్రావణమాసంలో దక్షిణ భారతదేశంలోని హిందువులు దాదాపుగా మాంసాహారానికి, చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు. పవిత్రమైన శ్రావణమాసంలో పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అలాంటి శ్రావణమాసంలోని పౌర్ణమి రోజు ప్రతి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి వైభవంగా అధిక మాసం శ్రావణ పౌర్ణమి గరుడ సేవ నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామి వారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు బారులు తీరారు. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

On the auspicious Adhika Masa Shravana Pournami, the monthly Garuda Seva was observed in Tirumala.

గ‌రుడ వాహ‌నం స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం అని పురాణాలు చెబుతున్నాయి.

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియచెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నారు.

On the auspicious Adhika Masa Shravana Pournami, the monthly Garuda Seva was observed in Tirumala.

అధిక మాసంలో ముఖ్యమైన పనులు చెయ్యకూడదని కొందరు చెబుతారు. అయితే శ్రీవారిని నమ్మకుని మంచి పనులు చేస్తే అంతా మంచే జరుగుతుందని పెద్దలు అంటున్నారు. అధిక మాసం సందర్బంగా తమిళ సోదరులు తిరుమలకు క్యూ కడుతున్నారు. అధిక మాసంలో శ్రీవారిని దర్శించుకుంటే అంతా శుభం జరుగుతుందని భక్తకోటికి నమ్మకం.

మంగళవారం తిరుమలలో భక్తుల రద్ది సాధారణంగా ఉంది. మంగళవారం రాత్రి వరకు శ్రీవారిని 67, 728 మంది భక్తులు దర్శనం చేసుకుని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. 21, 084 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం తిరుమల హుండీ ఆదాయం రూ. 4 కోట్ల 24 లక్షల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

On the auspicious Adhika Masa Shravana Pournami, the monthly Garuda Seva was observed in Tirumala.

మంగళవారం తిరులలో ఐదు కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనం టోకన్లు లేని భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పట్టిందని బుధవారం ఉదయం టీటీడీ అధికారులు తెలిపారు. శ్రవాణమాసం సందర్బంగా తిరుమలలో శుక్రవారం, శనివారం, ఆదివారం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంటున్నారు. శ్రావణమాసం రావడం, వీకెండ్ సందర్బంగా తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+