వారిని తోలు ఊడేలా కొట్టాలి: నాకు ఇద్దరు ఆడబిడ్డలంటూ దిశ, సుగాలి ఘటనలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

తిరుపతి: ఆడపడచులు ధైర్యంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తిరుపతిలో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక మహిళ డాక్టర్‌ను నలుగురు మానవ ఉన్మాదులు మానభంగం చేసి చంపేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని మండిపడ్డారు. ఆడబిడ్డల మానప్రాణాల కోసం తనను లాంగ్ మార్చ్ చేయాలని కోరుతున్నారని చెప్పారు.

నేనే కర్రపట్టుకుని..

నేనే కర్రపట్టుకుని..

ఇంటి నుంచి వెళ్లిన ఆడబిడ్డ క్షేమంగా వస్తుందా? రాదా? అని కుటుంబసభ్యులు భయపడే పరిస్థితి ఎందుకని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. సినిమా షూటింగ్ కోసం రూ. వెయ్యి, 2వేలకు ఆడవాళ్లను తీసుకెళతారని.. ఒక్కోసారి వారికి తగిన రక్షణ పరిస్థితులు ఉండవన్నారు. ఒకసారి వారికి ఇబ్బంది కలిగినప్పుడు తానే కర్ర పట్టుకుని వారిని సురక్షితంగా పంపించానని తెలిపారు.

151 సీట్లు ఎందుకు?

151 సీట్లు ఎందుకు?

మన ఇంటి ఆడపడుచుల మానప్రాణాలకు రక్షణ కల్పించని 151 సీట్లు ఎందుకని వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మీడియా ముందు కూర్చుని బూతులు తిట్టడానికా? అని నిలదీశారు. బాధ్యత లేకుండా నేతలు, మంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలని.. నేతల తీరు వల్లే ఇలాంటివారు దుర్మార్గులు రెచ్చిపోతున్నారన్నారు.

తోలు ఊడిపోయేలా కొట్టాలి..

తోలు ఊడిపోయేలా కొట్టాలి..

నిందితులు హైదరాబాద్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఉంటే జనం వారిని చంపేయండి అంటున్నారని.. వారి ఆక్రోశంలో అర్థముందని అన్నారు. ఒక జడ్జీ కూడా ఇలాంటి ఘటనల్లో దోషులైన వారి అంగాలను కోసేయండిన అన్నారని చెప్పారు. ఇలాంటి దారుణాలకు పాల్పడిన నిందితుల తోలు ఊడిపోయేలా కొట్టాలని అన్నారు.
దేవతల చేతుల్లో ఆయుధాలు ఎందుకంటే.. తప్పుచేసిన వారిని దండించడానికేనని అన్నారు.

ఆ అమ్మాయి ఉరి ఎందుకు వేసుకుంది?

ఆ అమ్మాయి ఉరి ఎందుకు వేసుకుంది?


నేరాలు చేస్తే దండించడం ముఖ్యమని.. అయితే ఉరితీయడం కూడా పొరపాటేనని అన్నారు. సింగపూర్ తరహాలో నిందితుల తోలు ఊడేలా బెత్తం దెబ్బలు ఉండాలన్నారు. సుగాలి యువతి అనే యువతి ఘటన టీడీపీ హయాంలో జరిగిందని, కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్‌కు వెళ్లి చనిపోయిందన్నారు. 14ఏళ్ల అమ్మాయి ఎందుకు ఉరివేసుకుందని ప్రశ్నించారు.

జగన్ రెడ్డి దీనిపైనా విచారణ జరిపించాలి..

జగన్ రెడ్డి దీనిపైనా విచారణ జరిపించాలి..

ఆ అమ్మాయి గర్భసంచిలో వీర్యాలు ఉన్నాయని తేలిందని.. బాధితురాలి తల్లి చెప్పిన మాటలే తాను చెబుతున్నాని పవన్ కళ్యాణ్ చెప్పారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ చేసిన పనులన్నీంటిపైనా రివర్స్ టెండరింగ్, తదితరాలు చేస్తున్న జగన్ రెడ్డి సర్కారు.. సుగాలి యువతికి న్యాయం ఎందుకు చేయరని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

నాకు ఇద్దరు ఆడబిడ్డలు..

నాకు ఇద్దరు ఆడబిడ్డలు..

తాను ఇద్దరు ఆడబిడ్డల తండ్రినని పవన్ కళ్యాణ్ చెప్పారు. అన్యాయం జరిగినప్పుడు కులం, మతం చూడకూడదని అన్నారు. వరంగల్ స్వప్నికపై యాసిడ్ దాడి జరిగినప్పుడు ఆమెను కలిశానని... తనలా మరో అమ్మాయికి జరగకుండా చూడన్నా.. అని ఆమె తనతో చెప్పిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అదేరోజు రాత్రి ఆమె చనిపోయిందని తెలిపారు.

ఏడు కొండలకు తప్ప అన్నింటికీ వైసీపీ రంగులేశారు..

ఏడు కొండలకు తప్ప అన్నింటికీ వైసీపీ రంగులేశారు..

సుగాలి చనిపోతే సీమ నేతలు ఎవ్వరు మాట్లాడారా? అని పవన్ కళ్యాణ్ నిలదీశారు.
మనుషులను బతకనివ్వరు.. ఊళ్లల్లో ఉండనివ్వరు అని మండిపడ్డారు. టీడీపీ చెట్లు, జనసేన చెట్లు, కాంగ్రెస్ చెట్లను కూడా వీళ్లు బతకనివ్వరని.. విడదీస్తారని అన్నారు. వైసీపీ రంగులు ఒక్క ఏడుకొండలకు తప్పా అన్నింటికీ వేసిందని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+