• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీటీడీ..ఇదేమిటీ? కిరీటాల కోసం వెళ్తే అసలు గుట్టు బట్టబయలు

|

తిరుపతి: అదేదో ముతక సామెత చెప్పినట్టుంది ఘనత వహించిన టీటీడీ అధికారుల నిర్వాకం. ఒక చోరీ జరిగింది కదా అని దాని గురించి ఆరా తీయడం మొదలుపెడితే, ఏకంగా అసాంఘిక కార్యకలాపాల డొంకే కదిలింది. వాటి గుట్టురట్టయింది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కిందిస్థాయి ఉద్యోగులకు ఏమాత్రం భయం లేదని సర్దిచెప్పుకోవచ్చు. కనీసం దేవుడంటే కూడా భయమూ, భక్తి ఉండక్కర్లేదా? అనిపించే ఉదంతం ఇది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలో బీరు బాటిళ్లు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫూటుగా తాగి పడేసిన బీరు బాటిళ్లు అవి. ఆలయ ఆవరణలో అమర్చిన చెత్త తొట్టిలో బీరు బాటిళ్లు కళకళలాడుతూ కనిపించాయి. వాటిని చూసి భక్తులు అవాక్కయ్యారు.

గోవిందరాజ స్వామి దేవస్థానంలోని అమ్మవారి ఉప ఆలయంలో ఉత్సవ మూర్తులకు అమర్చిన మూడు కిరీటాలు ఇటీవలే మాయమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తిరుపతి అర్బన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమ దర్యాప్తులో భాగంగా..రాత్రి వారు ఆలయ ప్రాంగణంలో సోదాలు చేపట్టారు. అణువణువూ గాలించారు. చెత్త తొట్టిలను కూడా వదల్లేదు. కిరీటాలను బయటికి తీసుకెళ్లడం కుదరక.. దొంగలు చెత్త తొట్టిలో దాచి పెట్టి ఉండొచ్చనే అనుమానం వారిది.

Police and TTD Officials found Beer Bottles in the premises of govindaraja swamy temple at tirupathi

ఆ అనుమానంతోనే చెత్త తొట్టిలో గాలించగా.. బీరు బాటిళ్లు కనిపించాయి. ఒక సమస్య కోసం వెళ్తే.. మరో సమస్య ఎదురైందే అనేలా ముఖం పెట్టారు పోలీసులు. కిరీటాల కోసం మొదలు పెట్టిన అన్వేషణ చివరికి బీరు బాటిళ్ల దాకా చేరింది. అసలు సమస్యను వదిలి పెట్టి, దీనిపై తమ నిఘాను కేంద్రీకరించారు. ఆలయ సిబ్బందిని పిలిపించి, ప్రశ్నించారు. చెప్పుల స్టాండ్ నిర్వాహకులు, చెత్త ఊడ్చే వారు, ఆలయ అటెండర్లు.. ఇలా ఒక్కొక్కరినీ విచారించారు. బీరు బాటిళ్లు ఎలా వచ్చాయనే ప్రశ్నకు ఏ ఒక్కరి వద్ద కూడా సమాధానం దొరకలేదు.

బీరు బాటిళ్లు దొరికిన ఘటనను టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు నేరంగా పరిగణిస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇప్పటిదాకా ఈ పని ఎవరు చేశారనేది తెలియరాలేదు. ఆలయం ఆవరణలో స్వీపర్లుగా పనిచేస్తున్న వారిలో మహిళలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. వారిలో ఎవరూ ఈ పని చేసి ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులు తమ వెంట బీరు బాటిళ్లను అస్సలు తీసుకుని రారని, ఇది కూడా ఇంటిదొంగల పనే అయి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

కిరీటాలు చోరీకి గురైన ఘటనలో ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో పురోగతి కనిపించలేదు. అర్చకులు, ఆలయ సిబ్బంది, సహాయ కార్యనిర్వాహణాధికారిని ప్రశ్నించారు. వారి నుంచి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. వారి నుంచి ఆశించిన స్థాయిలో సమాచారం రాలేదని తెలుస్తోంది. సీసీటీవీలు ఉండి ఉంటే కేసును ఈ పాటికి ఛేదించే వాళ్లమని అంటున్నారు పోలీసులు. కొందరు అర్చకుల కుటుంబీకులను కూడా పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. బయటి వ్యక్తుల ప్రమేయం ఏ మాత్రం లేదని, ఇంటి దొంగల పనే అయి ఉంటుందని అంటున్నారు. ఆ దొంగ ఎవరనేది తేలడానికి ఎంత సమయం పడుతుందనేదే చిక్కు ప్రశ్నగా మారింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police and TTD vigilance team shocked when they were found empty beer bottles in dustbin kept at Sri Govindaraja Swamy temple premises at Tirupathi. Police and TTD vigilance team inquired about who thrown the beer bottles at dustbin in temple premises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more