శ్రీవారికి నృత్య నీరాజనం - భరతనాట్యం చేస్తూ తిరుమలకు..!!
Tirumala: తిరుమలలో త్రైమాసిక మెట్లోత్సవం తెల్లవారుజామున అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 3,500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు. గోవింద నామాలతో మెట్ల మార్గం ప్రతిధ్వనించింది. మరో వైపు శ్రీవారికి యువకుడి నృత్య నీరాజనం భరతనాట్యం చేస్తూ ఓ యువకుడు నడక మార్గంలో తిరుమల చేరుకున్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన డాక్టర్ పి.కృష్ణవాసు శ్రీకాంత్ భరతనాట్య కళాకారుడు. శ్రీవారికి నృత్య నీరాజనం భరతనాట్యం చేస్తూ నడక మార్గంలో తిరుమల చేరుకున్నారు. పల్నాడులోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్జాన పీఠం కోటప్పకొండ విద్యాలయంలో సంస్కృత అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. శ్రీవారి మెట్టుమార్గం నుంచి భరత నాట్యం చేసుకుంటూ 75 నిమిాషాల్లో తిరుమల చేరుకున్నారు. సాధారణ ఈ మార్గంతో నడుస్తూ వెళ్తే గంటన్నార సమయం పడుతుంది. నృత్యాన్ని భక్తులకు పరిచయం చేసే ప్రయత్నంగా కృష్ణవాసు పేర్కొన్నారు. అన్నమయ్య..త్యాగయ్య కీర్తనలకు నృత్యం చేస్తూ తిరుమల కు చేరుకున్నట్లు వెల్లడించారు.

తిరుమలలో మెట్లోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పూర్వం నుండి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచివెళ్లి స్వామివారి కృపకుపాత్రులయ్యారని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ శ్రీనివాసులు చెప్పారు. దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం తెల్లవారుజామున అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. పూర్వం పురందరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు.
అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. భజనమండళ్ల సభ్యులు టీటీడీ మూడో సత్రం ప్రాంగణం నుండి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 3,500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.












Click it and Unblock the Notifications