తిరుమలలో శ్రీవారి ధర్మరథం చోరీ
తిరుపతి: తిరుమలలోని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కార్యాలయం నుంచి ధర్మరథాన్ని ఆదివారం గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. తిరుమలలో భక్తులను ఉచితంగా తరలించేందుకు శ్రీవారి ధర్మరథం పేరుతో టీటీడీ పది ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తోంది. వీటిని పగలు వినియోగించిన అనంతరం జీఎన్సీ టోల్‌గేట్‌కు సమీపంలోని టీటీడీ రవాణా కార్యాలయంలో ఉంచి రాత్రి ఛార్జింగ్ పెడతారు.
ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు ఆదివారం తెల్లవారుజామున 3.53 గంటల సమయంలో బస్సును దొంగలించారు. ఉదయం రవాణా అధికారులు గుర్తించి తిరుమల క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ కెమెరాలు, బస్సులో ఏర్పాటు చేసిన జీపీఎస్ ద్వారా బస్సు నాయుడుపేట బిరుదవాడకు సమీపంలోని టిడ్కో ఇళ్ల వద్ద రహదారిపై వదిలివెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను పంపి బస్సును స్వాధీనం చేసుకున్నారు. రవాణా కార్యాలయం వద్ద తగినంత భద్రతా సిబ్బంది లేకపోవడం, సరైన భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే బస్సు చోరీకి గురైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.
మరోవైపు, వారం కిందట టీటీడీకి చెందిన ఓ ఎలక్ట్రిక్ కారును దుండగులు దొంగలించారు. కడప సమీపంలోని ఒంటిమిట్ట ఆలయం వద్ద వాహనాన్ని స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో టీటీడీ అధికారులు వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చంద్రప్రభ వాహనంపై ఉభయదేవేరులతో గోవిందుడు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు వివిధ వాహనాలపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. చంద్రప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ శ్రీదేవి భూదేవి సమేడుైన మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు రాత్రి శ్రీవారు చంద్రప్రభ వాహనంపై దివ్యమంగల స్వరూపునిగా భక్తులకు దర్శనమిచ్చారు.












Click it and Unblock the Notifications