Tirumala: తిరుమలకు వెళ్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
తిరుమలకు వెళ్లే భక్తులు తమ జేబుల్లో మరింత ఎక్కువగా డబ్బులు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఎందకంటే టీటీడీ చార్జీలు పెంచింది కాబట్టి. పెంచడం అంటే మామూలుగా కాదు.. వందల రేట్ల పెంచింది. ముఖ్యంగా గది అద్దెలు భారీగా పెంచేసింది. ఒక రోజుకు ఒక గదికి రూ.150 ఉన్న అద్దె ఇప్పుడు రూ.1700 కి పెంచింది.

లడ్డూ
టీటీడీ పాలకవర్గం ఇప్పటికే లడ్డూ సహా ప్రసాదాల ధరలు పెంచింది. తాజాగా గదుల అద్దె పెంచడంతో భక్తులపై మరింత భారం పడే అవకాశం ఉంది. భక్తులకు ఉచితంగా ఇచ్చే లడ్డూల సంఖ్యను కుదించింది కూడా. తిరుమల కొండపై సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఎస్వీ, నారాయణగిరి అతిథి గృహాల్లో గదుల అద్దెలను ఒక్కసారిగా 150 నుంచి 17 వందలకి పెంచడం భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

7,200 గదులు
తిరుమలలో దాదాపు 7,200 గదులు ఉన్నాయి. వాటిలో ఒక గదికి ఒకరోజు అద్దె రూ.50 మాత్రమే. ఇక రాంబగీచా, వరాహస్వామి గెస్ట్‌హౌస్, ఎస్ఎన్ జీహెచ్, హెచ్ వీడీసీ, ఏటీసీ, టీబీసీల్లో రూ.100, నారాయణగిరి, ఎస్వీ గెస్ట్‌హౌస్‌లలో రూ.150, విష్ణుపాదంలో రూ.250, వకుళమాత, కౌస్తుభం, పాంచజన్యం, నందకం అతిథి గృహాల్లో రూ.500 చొప్పున ఉండేవి. ఇటీవల నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత అతిథి గృహాల ధరల్ని వెయ్యికి పెంచేశారు.

దివ్యదర్శనం
కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు ఇంతకుముందు 'దివ్యదర్శనం' సౌకర్యం ఉండేది. దివ్యదర్శనానికి రోజుకు 20వేల మందికి టోకెన్లు ఇచ్చేవారు. టోకెన్లతో పాటు ఉచితంగా ఒక లడ్డూ, దానికి అదనంగా రెండు లడ్డూలు రూ.10 రూపాయల చొప్పున, మరో రెండు లడ్డూలు రూ.25 చొప్పున ఇచ్చేవారు. కరోనా తర్వాత దివ్యదర్శనం సౌకర్యం తీసేశారు.












Click it and Unblock the Notifications