తిరుమల సాలకట్ల తెప్పోత్సవ సంబరం: కన్నులపండుగగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి పుష్కరిణిలో విహారం!!

తిరుమల సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి పుష్కరిణిలో నాలుగోరోజు ఐదుసార్లు విహరిస్తే, నేడు పుష్కరిణిలో ఏడుసార్లు స్వామివారు ఈరోజు విహరిస్తారు.

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మార్చి మూడవ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు శాస్త్రోక్తంగా సాలకట్ల తెప్పోత్సవాలను భక్తులకు కన్నుల పండుగగా సాలకట్ల తెప్పోత్సవాలను నిర్వహిస్తున్నారు.

తిరుమల సాలకట్ల తెప్పోత్సవాలలో తొలినాడు స్వామి దర్శనం ఇలా

తెప్పోత్సవాలను ప్రారంభించిన తొలి రోజు శ్రీవారు పుష్కరిణిలో సీత లక్ష్మణ ఆంజనేయ సమీపంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుత్ కాంతుల నడుమ స్వామివారు అమ్మవారు తెప్పపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేయగా భక్తి పారవశ్యంలో భక్తులందరూ జయ జయ ధ్వనాలతో స్వామిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు.

రెండవరోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామిగా

భక్తుల గోవింద నామస్మరణలతో తిరుమల సాలకట్ల తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు రాత్రి రుక్మిణి సమేతంగా శ్రీ కృష్ణ స్వామి అవతారంలో మూడుసార్లు పుష్కరిణిలో విహరించి భక్తులను కరుణించారు స్వామివారు. ఇక మూడు, నాలుగు, ఐదు రోజులలో పూజలు త్రయోదశితో ప్రారంభమై పౌర్ణమితో ముగుస్తాయి. ఈ మూడు రోజుల్లోనూ ఉత్సవ విగ్రహాలైన మలయప్ప స్వామి తో పాటు శ్రీదేవి భూదేవిలను పూజిస్తారు. ఈ క్రమంలోనే మూడవరోజు ఆదివారం, నాలుగో రోజు సోమవారం రాత్రి మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సహితంగా పుష్కరిణిలో విహరించారు.

మూడు, నాలుగు రోజులలో శ్రీదేవి, భూదేవి సహిత మలయప్ప స్వామిగా

మూడో రోజు మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సహితంగా మూడు సార్లు తెప్పపై విహరించి భక్తులను కరుణించారు. ఇక నాలుగో రోజు ముందుగా స్వామి వారిని అమ్మవారి ఉత్సవ మూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగించి ఆ తరువాత శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. రాత్రి ఏడు గంటల నుండి 8 గంటల వరకు విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా ఉన్న తెప్పలపై స్వామివారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ మలయప్ప స్వామి వారు ఆసీనులై ఐదు చుట్లు విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు.

నేడు చివరిరోజు మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సహితంగా ఏడుసార్లు విహారం


వేద పండితుల వేద పారాయణలు, అన్నమాచార్య సంకీర్తనలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామి తెప్పోత్సవం కనుల పండుగగా జరిగింది. ఇక చివరి రోజు అయిన నేడు మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సహితంగా పుష్కరిణిలో ఏడుసార్లు తెప్పపై విహరించి భక్తులను కటాక్షిస్తారని తెలుస్తుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

అతి ప్రాచీన కాలం నుండి స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలు

ప్రతి సంవత్సరం ఐదు రోజులపాటు తిరుమల శ్రీవారి పుష్కరిణిలో జరిగే ఈ సాలకట్ల తెప్పోత్సవం అతి పురాతన కాలం నుంచి జరుగుతున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. ప్రతి ఏటా తిరుమల శ్రీవారికి ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు తెప్పోత్సవాలు నిర్వహించే ఆనవాయితీలో భాగంగా ఈ ఏడాది కూడా ఘనంగా స్వామివారి సాల కట్ల తెప్పోత్సవాలను నిర్వహిస్తున్నారు. నేటితో సాలకట్ల తెప్పోత్సవాలు ముగియనున్న నేపథ్యంలో నేడు చివరి రోజు పుష్కరిణిలో విహరించే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+