Tirupati: దేశం, ప్రజలు క్షేమంగా ఉండాలి, లోక్ షభ స్పీకర్ ఓం బిర్లా, స్పీకర్ వెంట విజయసాయి రెడ్డి, వైవీ !
తిరుపతి/తిరుచానూరు: భారతదేశం క్షేమంగా ఉండాలని, దేశంలోని ప్రతి ఒక్కరూ ఆయారారోగ్యాలతో ఉండాలని శ్రీ పద్మావతి అమ్మవారిని కోరుకున్నానని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతి సమీపంలోని తిరుచానూరులో సోమవారం మద్యాహ్నం అమ్మవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు త్వరగా కోలుకోవాలని అమ్మవారిని వేడుకున్నానని లోకస్ సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని, అమ్మవారి ఆశీస్సులు దేశ ప్రజల అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నానని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మీడియాకు చెప్పారు.

తిరుచానూరులో లోక్ సభ స్పీకర్
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం మధ్యాహ్నం కుటుంబ సమేతంగా తిరుపతి సమీపంలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద లోక్ సభ స్పీకర్ కు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి తదితరులు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఆయన కుటుంబ సభ్యులకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంబానికి మొక్కు కున్న అనంతరం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఓం బిర్లా కుటుంబ సభ్యులు శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా రాక సందర్బంగా తిరుచానూరులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

దేశం, ప్రజలు క్షేమంగా ఉండాలి
భారతదేశం క్షేమంగా ఉండాలని, దేశంలోని ప్రతి ఒక్కరూ ఆయారారోగ్యాలతో ఉండాలని శ్రీ పద్మావతి అమ్మవారిని కోరుకున్నానని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతి సమీపంలోని తిరుచానూరులో శ్రీ పద్మవావతి అమ్మవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు త్వరగా కోలుకోవాలని అమ్మవారిని వేడుకున్నానని లోకస్ సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని, అమ్మవారి ఆశీస్సులు దేశ ప్రజల అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నానని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మీడియాకు చెప్పారు.

తరలి వచ్చిన టీటీడీ చైర్మన్, వైసీపీ ఎంపీలు
అమ్మవారి దర్శనం అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి, తిరుపతి ఎంపీ ఎం. గురుమూర్తి , డిప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి తదితరులు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వెంట ఉన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పర్యటన సందర్బంగా తిరుపతి, తిరుచానూరులో చిత్తూరు జిల్లా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుపతి పోలీసు అధికారులతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక భద్రతా సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చాలా సంతోషంగా తిరుచానూరు నుంచి బయలుదేరారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications