TTD: 12న మెట్లమార్గంలో పండుగలా వేలాది భక్తుల తిరుమల యాత్ర, ఇదీ ప్రత్యేకం..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారంతం కావటంతో క్రమేణా భక్తుల రాక పెరుగుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. జూలై 10 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. వేలాది మంది భక్తులు ఒకే సమయంలో భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు. తిరుమలలో నకిలీ టికెట్ల కట్టికి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

TTD

శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
టీటీడీ ఆధ్వర్యంలో జూలై 10 నుండి 12వ తేదీ వరకు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల గోవిందరాజస్వామి సత్రాల్లో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరుగనుంది. ఈ మూడు రోజుల పాటు ఉదయం భజన మండళ్లతో సుప్రభాతం, సామూహిక భజన కార్యక్రమాలు చేప‌డ‌తారు. సాయంత్రం సంగీత విభావరి, ప్రవచన కార్యక్రమాలు ఉంటాయి. జూలై 10న సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి మూడో సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం అధికార ప్రముఖులు సందేశం ఉంటుంది.

TTD

భజనలతో సప్తగిరీశుని యాత్ర
జూలై 12వ తేదీ ఉదయం 4 గంటలకు అలిపిరి పాదాల మండపం వ‌ద్ద‌ మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండళ్ల సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు. గ‌తంలో ఎందరో మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని కాలిన‌డ‌క అధిరోహించి స్వామివారి అనుగ్రహం పొందారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో దాస సాహిత్య ప్రాజెక్టు మెట్లోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది. పలు ప్రాంతాల నుంచి వచ్చే శ్రీవారి భక్తులు కలసి కట్టుగా భజన చేస్తూ సాగే ఈ యాత్ర ప్రత్యేకంగా నిలవనుంది.

TTD

దళారుల నియంత్రణకు చర్యలు
శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు నకిలీ టికెట్లను అందించటం, కొందరు ప్రజా ప్రతినిధులు సిఫార్సుల లేఖలపై దర్శనాన్ని ఇప్పించి భారీగా నగదును వసూలు చేస్తున్నారు. వీరికి కొందరు ప్రజా ప్రతినిధులు పక్కన ఉండే వారే సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు ప్రజా ప్రతినిధులే స్వయంగా శ్రీవారి దర్శనానికి భక్తులను తీసుకువస్తూ పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. దీంతో దళారులను అరికట్టేందుకు టీటీడీ విజిలెన్స్, పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. వీఐపీ బ్రేక్, సుప్రభాతం, ఆర్జిత సేవలకు వచ్చే భక్తుల వద్ద సమాచారానని సేకరిస్తూ దళారుల పని పట్టేందకు సిద్దం అవుతున్నారు. ఆరె నెలల కాలంలో దాదాపు 20 కేసులు నమోదు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+