తిరుమలలో 19 రోజులు భక్తులకు పండగే. అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని !

తిరుమల/తిరుపతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని శ్రీవారి భక్తులు ఆశపడుతుంటారు. నిత్యం భక్తుల రద్దీతో తిరుమల కిటకిటలాడుతుంది. ఇప్పుడు వేసవి సెలవులు రావడంతో తిరుమల గిరులు శ్రీవారి భక్తులతో నిండిపోనుంది. వేసవి సెలవుల సందర్బంగా టీటీడీ అధికారులు తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చెయ్యడానికి సిద్దం అవుతున్నారు.

ఏప్రిల్ 16 నుండి శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్స‌వాలు నిర్వహించడానికి టీటీడీ అధికారులు సర్వం సిద్దం చేసుకుంటున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 16 నుండి మే 5వ తేదీ వ‌ర‌కు భాష్యకార్ల ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఉత్సవం సందర్భంగా 19 రోజులపాటు తిరుమలలో ఉభయం సమర్పణ జరుగ‌నుంది.

Bashyakara Utsavam in Tirumala

శ్రీరామానుజుల వారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 25వ తేదీన భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.శ్రీ భాష్యకార్ల సాత్తుమొర సందర్భంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీ భాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

Bashyakara Utsavam in Tirumala

ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు. జీయర్‌స్వాములు, ఏకాంగులు తదితరులు ఈ వత్సవాల్లో పాల్గొంటారు. తిరుమలలో శ్రీవారి భక్తులను భాష్యకారుల ఉత్స‌వాలు ఆకట్టుకోనున్నాయి.

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తరువాత మొదట భక్తులు స్వామివారి ప్రసాదం తిరుమల లడ్డూలు తీసుకుంటారు. తరువాత శ్రీవారి ఆలయం ముందు ఎండ, వానలను కూడా లెక్క చెయ్యకుండా కొంతసేపు కుర్చుని శ్రీవెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటారు. ఇలా ప్రతినిత్యం శ్రీవారి ఆలయం ముందు శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తులు వేలాది మంది కుర్చోవడం మనం చూస్తూనే ఉంటాము.

ఏప్రిల్ 16వ తేదీ నుంచి రాత్రి 19 రోజుల పాటు శ్రీవారి భక్తులు ఈ ఉత్సవాలతో శ్రీవారిని స్మరించుకోనున్నారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీ భాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఎంతో వైభవంగా ఊరేగింపు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఉత్సవాలను చూస్తూ భక్తులు మైమరిచిపోవడానికి సిద్దం అవుతున్నారు. వేసవి సెలవుల సందర్బంగా మాడ వీధులను ప్రతినిత్యం శుభ్రంగా ఉంచడానికి టీటీడీ అధికారులు, సిబ్బంది, పారిశుద్ద కార్మికులు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. అయితే ఈ ఉత్సవాల సందర్బంగా శ్రీవారి సేవలు అన్నీ యాధావిధిగా కొనసాగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+