Tirumala: తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు స్వామి వారి దర్శనం కోసం 25 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. వెంకటేశ్వరుడి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. కాగా శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు మంగళవారంతో ముగిస్తాయి. బుధవారం నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు పునప్రారంభం అవుతాయి. స్వామి వారిని సోమవారం 68,263 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 28,355 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు.

కాగా నిన్న శ్రీనివాసుడి ఆదాయం రూ.3.65 కోట్లుగా వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అటు ద్వారకాతిరుమలలో మంగళవారం నుంచి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. తిరుమలలో నకడ దారిన వెళ్లే భక్తులకు భయం తగ్గింది. సోమవారం అటవీ శాఖ అధికారులు నాలుగో చిరుతను బంధించండతో ఆపరేషన్ చిరుత ముగిసినట్లుగా వారు ప్రకటించారు. నడక మార్గంలోని ఏడోవ మైలు వద్ద చిరుత కోసం ఏర్పాటు చేసిన బోనులో ఈ రోజు వేకువజామున చిరుత బోనుకు చిక్కిన విషయం తెలిసిందే.

TTD officials said that it takes 18 hours to visit Tirumala Srivaru

కాలినడక మార్గంలో సంచరిస్తున్న చిరుతను బంధించామని, దీంతో నడక మార్గంలో సంచరిస్తున్న మొత్తం నాలుగు చిరుతలను బంధించడం పూర్తయిందని అటవీ శాఖ అధికారి చెప్పారు. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో కేవలం ఈ నాలుగు చిరుతలను మాత్రమే కనిపించాయిని వివరించారు. ఎలుగుబంటి కూడా పది రోజుల క్రితం కనిపించిన విషయం వాస్తమే, కానీ అయితే గత ఐదు రోజులుగా నడక మార్గం వద్ద ఏర్పాటు చేసిన మూడు వందల ట్రాప్ కెమెరాలకు ఎలుగుబంటి కనిపించలేదన్నారు.

వర్షాలు పడుతుండడంతో ఎలుగుబంటి అటవీ ప్రాంతంలోనికి వెళ్ళినట్లు భావిస్తున్నాంమని పేర్కొన్నారు. ఏ‌క్షణమైనా ఎలుగుబంటి కదలికలు ట్రాప్ కెమెరాలకు కనిపిస్తే వేంటనే ఎలుగుబంటిని బంధించేందుకు అటవీ శాఖా అధికారులు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. అటవీ ప్రాంతంలో అటవీ శాఖా సిబ్బంది బీట్ కు వెళ్తున్నారని, గత పది రోజులుగా ఈ చిరుత బోను వద్దకు వచ్చి తిరిగి వెళ్ళి పోవడంను గుర్తించాంమని, నడక మార్గంకు ఇరువైపుల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిరుత కదలికలు గుర్తిస్తే, వేంటనే వాటిని బంధించడం అనేది మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటాంమని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+